twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ అత్తతో వెంకటేష్ రొమాన్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'అత్తారింటికి దారేది' చిత్రంలో పవర్ స్టార్ అత్త పాత్రలో నటించింది నటి నదియా. ఇప్పుడామె వెంకటేష్ సరసన నటించనుంది. దృశ్యం రీమేక్ గా రూపొందుతున్న చిత్రంలో ఆమెనే వెంకటేష్ భార్య పాత్రకు తీసుకున్నట్లు సమాచారం. మొదట మీనా ని ఆ పాత్రకు అనుకున్నా చివరి నిముషంలో ఈ మార్పు జరిగిందని ఫిల్మ్ వర్గాల సమాచారం.

    మిర్చి చిత్రంతో మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చిన నదియా....పవన్ స్టార్ సినిమాతో పెద్ద స్టార్‌గా మారి పోయింది. దీంతో ఆమెను తమ చిత్రాల్లో తీసుకోవాలని నిర్మాణ సంస్ధలు పోటీ పడుతున్నాయి . ఒక టైంలో తెలుగు, తమిళ, మలయాళ సినిమాలను ఊపేసిన నదియాకి వివాహంతో గ్యాప్ వచ్చింది. చాలా కాలం తర్వాత రీఎంట్రీతో మళ్లీ బిజీ అయిపోతుంది.

    Nadhiya replaced Meena

    నదియా 1988 లో 'బజార్ రౌడీ' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అయింది. ఆమె పెళ్లి తర్వాత తెలుగు తెరకు దూరమై మళ్లీ మిర్చి చిత్రంలో దర్శనం ఇచ్చింది. నదియా 'మిర్చి'లో ప్రభాస్ కు తల్లిగా నటించి మంచి మార్కులనే కొట్టేసింది. ఈ సినిమా చూసిన వారు నదియాకు ప్రత్యేకంగా మార్కులు వేశారు. దీంతో తెలుగులో మరో ఆఫర్ లభించింది. నదియా ఇప్పుడు పవన్ కల్యాణ్ కు అత్తగా నటించే ఛాన్స్ కొట్టేసింది. పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో సమంతకు తల్లిగా నటించిందిది. ఇందులో కూడా ఆధునిక భావాలున్న మహిళగానే నదియా కనిపించి అలరించింది. ఈ సినిమా తనకు మరింత గుర్తింపు వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తోంది.

    1994లో సినీ పరిశ్రమకు దూరమయ్యాక.. 2004లో తమిళంలో ఎన్‌.కుమరన్‌ సన్‌ ఆఫ్‌ మహలక్ష్మీ చిత్రంతోనే మళ్లీ వచ్చా. తెలుగు 'ఇడియట్‌'కు అది రీమేక్‌. హీరో తల్లి పాత్రని అందులో జయసుధ అద్భుతంగా చేశారు. కానీ దాన్లో కొన్ని సన్నివేశాలే చూశా. ఎందుకంటే జయసుధ నటన ప్రభావం నాపై పడకూడదని. ఆ సినిమా విడుదలయ్యాక తమిళ ప్రేక్షకులు 'ఆహా.. ఓహో' అన్నారు. అలా నా రెండో ఇన్నింగ్స్‌ పెద్ద విజయంతో మొదలైంది. గత తొమ్మిదేళ్లలో ప్రాధాన్యమున్న పాత్రలే అంగీకరించాను. వాటిలో 'మిర్చి' ఒకటి. కుటుంబం కోసం తపన పడిన ఓ గృహిణి ఒక్క క్షణంలో ప్రాణాలు కోల్పోయే ఆ పాత్ర నాకెంతో నచ్చింది. నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది కూడా.

    ప్రస్తుతం ఆరు భాషలు వచ్చునాకు! తాజాగా ఏడో భాష నేర్చుకోవాలనుంది. తెలుగు గురించే చెబుతున్నాలెండి! అందరూ అడుగుతుంటారు.. ఈ వయసులోనూ మీరెలా ఇంత ఫిట్‌గా ఉంటున్నారని. నిజం చెప్పాలంటే.. నాకు తిండిపై మహా మోజు. అంతగా తినే నేను.. అంతేస్థాయిలో వ్యాయామం చేయక తప్పుతుందా? తెలుగులో ఇప్పుడు చాలా అవకాశాలొస్తున్నాయి. మంచి కథ.. నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాతో మళ్లీ మీ ముందుకొస్తా అంటోంది నదియా.

    English summary
    Nadhiya was approached by director Sripriya for female lead, she will be directing remake of Drishyam with Venkatesh as hero.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X