twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగచైతన్య 'ఒక లైలా కోసం' టీజర్ ఎప్పుడు

    By Srikanya
    |

    Naga Chaitanya's Oka Laila Kosam teaser on
    హైదరాబాద్ : నాగచైతన్య హీరో గా విజయ్‌కుమార్‌ కొండ దర్శకత్వంలో 'ఒక లైలా కోసం' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. చిత్రప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ని ఈ నెల(ఏప్రియల్)చివరి వారంలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

    చిత్రం కాన్సెప్టు ను దర్శకుడు చెపుతూ... '' ఒక అమ్మాయి కోసం... ఆమె ప్రేమకోసం అబ్బాయి పడిన కష్టమే ఈ చిత్రం. వినోదాత్మకమైన ప్రేమకథ ఇది. నాగచైతన్య కెరీర్‌లో గుర్తిండిపోయే సినిమాగా తీర్చిదిద్దుతున్నాం. హీరో,హీరోయిన్స్ మధ్య వచ్చే సన్నివేశాలు వైవిధ్యంగా ఉంటాయి. మార్చి చివరి నాటికి టాకీ పార్టు చిత్రీకరణ పూర్తవుతుంది. ''అన్నారు.

    దర్శకుడు విజయ్‌కుమార్‌ కొండా మాట్లాడుతూ... ''ఎనిమిది నెలలపాటు శ్రమించి కథను సిద్ధం చేశాం. 'గుండె జారి గల్లంతయ్యిందే' కంటే రెండింతలు ఎక్కువ వినోదం ఉంటుంది. సినిమా చూశాక బంధువుల పెళ్లికి వెళ్లొచ్చిన అనుభూతి కలుగుతుంది. నాగచైతన్యని తెరపై కొత్త తరహాలో చూపించబోతున్నాం''అన్నారు.

    బ్రహ్మానందం, అలీ, ప్రభు గణేషన్‌, నాజర్‌ తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: ఐ. ఆండ్రూ, కూర్పు: ప్రవీణ్‌ పూడి. ఈ చిత్రానికి నిర్మాతః నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: విజయకుమార్‌ కొండా.

    English summary
    Naga Chaitanya, Pooja Hegde's ‘Oka Laila Kosam’ under Vijay Kumar's direction is currently progressing in RFC, Hyderabad. Plans are on to release the film's teaser in the last week of April. Anup Rubens is the music director for the film which stars Brahmanandam, Ali, Prabhu, Nazar and others.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X