twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దారుణం: రిలీజ్ కు ముందే ఈ నెగిటివ్ టాక్

    By Srikanya
    |

    హైదరాబాద్ : హర్షవర్థన్‌ రాణే, అవంతిక, సుష్మ, నందిని రాయ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం 'మాయ'. నీలకంఠ దర్శకత్వం వహించారు. మధుర శ్రీధర్‌రెడ్డి, ఎం.వి.కె.రెడ్డి నిర్మాతలు. వచ్చే నెల 1న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇంకా ఈ చిత్రం విడుదలకు నాలుగు రోజులు ఉంది ...ఈ లోగా ఈ చిత్రంపై వెబ్ మీడియాలో నెగిటివ్ టాక్ మొదలైపోయింది. ఈ చిత్రం ఇన్ సైడ్ టాక్ అంటూ సినిమా గురించి రకరకాల వార్తలు వినపడుతున్నాయి.

    ఆ టాక్ లో చెప్పేదేమిటంటే... ఈ చిత్రం స్టోరీ లైన్ చాలా ఆర్డనరీగా ఉందని, అందుకు తగినట్లే స్క్రీన్ ప్లే ఇంకా దారుణంగా ఉందనీను. అంతేకాదు..ఈ చిత్రంలో థ్రిల్లర్ కి తగ్గ దినుసులు సరిగ్గా లేవని అంటున్నారు. బిలో యావరేజ్ ఎంటర్టైనర్ గా చిత్రం మిగిలిపోతుందని అంటున్నారు. అయితే సినిమా రిలీజే కాకముందే ఇలాంటి టాక్ రావటం, తేవటం దారుణం అంటున్నారు. ఇలాంటి వాటివల్లే ఓపినింగ్స్ కు దెబ్బ తగిలే అవకాసముందని సినీ వర్గాలు అంటున్నాయి.

    Neelkanta's Maaya inside talk

    దర్శకుడు నీలకంఠ మాట్లాడుతూ... ''నా గత చిత్రాలు కాస్త ఇబ్బందిని కలిగించాయి. ఈ సమయంలో మంచి విజయం కోసం ఈ చిత్రం ప్రారంభించాం. వైవిధ్యంగా సాగుతూ వినోదాన్ని అందిస్తుందీ చిత్రం. మనుషుల్లో ఉండే అతీంద్రీయ దృష్టి నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలిసినప్పుడు తలెత్తే సంఘర్షణ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. కథతో పాటు కథనంలోని కొత్తదనం ప్రేక్షకుల్ని రక్తికట్టిస్తుంది'' అన్నారు నీలకంఠ.

    ఇప్పటికే ఈ సినిమా ప్రచారంలో భాగంగా చిత్రీకరించిన 'పోకిరి రాజా ఈల వేసినాడే...' అంటూ సాగే ధోతీ డ్యాన్స్‌ ప్రచార గీతాన్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. .

    ''నీలకంఠ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని మాయాలోకంలో విహరింపజేసినట్టు ఉంటుంది. శేఖర్‌చంద్ర సమకూర్చిన సంగీతం చిత్రానికి బలాన్నిచ్చింది'' అన్నారు నిర్మాతల్లో ఒకరైన మధుర శ్రీధర్‌రెడ్డి. చిత్రంలో నాగబాబు, ఝాన్సీ, అనితా చౌదరి, వేణు తదితరులు నటించారు. చిత్రానికి ఛాయాగ్రహణం: బాల్‌రెడ్డి, కూర్పు: నవీన్‌ నూలి, కళ: గొల్లపల్లి బాబ్జి

    English summary
    Neelakanta is coming to entertain with Maaya, a film on Extra Sensory Perception on Aug 1st.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X