twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ - కొరటాల శివ చిత్రం ప్రారంభం ఎప్పుడంటే...

    By Srikanya
    |

    హైదరాబాద్ : మిర్చి చిత్రంతో దర్శకుడుగా టర్న్ అయిన రచయిత కొరటాల శివ. ఆయన తన తదుపరి చిత్రం రామ్ చరణ్ తో ప్రారంభించినా అది వర్కవుట్ కాలేదు. దాంతో ఎన్టీఆర్ తో కొరటాల శివ ముందుకు వెళ్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ చిత్రం డిసెంబర్ లో మొదలు కానుంది. రెగ్యులర్ షూట్ ...జనవరి నుంచి ఉండవచ్చు అని తెలుస్తోంది.

    ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న రభస తర్వాత ఈ చిత్రం షూటింగ్ కంటిన్యూగా జరగనుంది. ఈ చిత్రాన్ని దానయ్య నిర్మిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. రభస విషయానికి వస్తే... ఎన్టీఆర్‌ హీరోగా సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫిల్మ్‌సిటీలోని ఫ్లెక్స్‌ హౌస్‌లో చిత్రీకరణ జరుగుతోంది. సమంత, ప్రణీత హీరోయిన్స్. బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మాత. ఈ నెల 5వరకు ఇక్కడ చిత్రీకరణ జరుగుతుంది.

    ఇక బాధ్షా లో.. డిఫెరెంట్ హెయిర్ స్టైల్స్ తో కనిపించిన ఆయన ఈ రభస చిత్రం లో కూడా చాలా విభిన్నంగా కనిపించటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన ప్రిపేరవుతున్నట్లు సమాచారం. అందులోనూ ఈ చిత్రంలో ఆయన ప్లే బోయ్ గా కనిపించనున్నారు కూడా.

    దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ... "మేం ఇప్పటి వరకూ ప్రత్యేకంగా ఏదీ అనుకోలేదు. కానీ కొత్త హెయిర్ స్టైల్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాం. ఈ చిత్రంలో మల్టిఫుల్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించబోతున్నాడు. అందులో భాగంగానే హెయిర్ స్టైల్ ని మార్చాలనుకుంటున్నాం ," అని తేల్చి చెప్పారు.

    రామ్‌ హీరోగా సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో శ్రీసాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై బెల్లంకొండ సురేష్‌ నిర్మించిన 'కందిరీగ' భారీ విజయం అందుకుంది. ఆ ఉత్సాహంతో ఈ సారి సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఇదే బేనరులో ఎన్టీఆర్‌ హీరోగా సినిమా తెరకెక్కనుంది. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2014 సంక్రాంతికి విడుదల చేస్తామన్నారు. దీనికి వర్కింగ్ టైటిల్ గా 'రభస' పేరును నిర్ణయించారు. ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే దీనిని మార్చే అవకాశం ఉంది.

    English summary
    Young tiger Junior NTR will team up with Koratala Siva for a film that will start from next year. Sources tell us that the film will have its muhurat ceremony in December. The regular shoot of this film might start either in the end of December or early January.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X