twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెండు రాష్ట్రాలు...రెండు చోట్లా ఆడియో లాంచ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : సినిమా వాళ్లకు ప్రాంతీయ భేధాలు లేవన్నది నిజమే కానీ...ప్రేక్షకులకు ఎంత దగ్గరకి వెళ్లి వాళ్లవాళ్లం అనిపించుకోవటం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు రెండు రాష్ట్ల్రాలుగా మారిన నేపధ్యంలో రెండు చోట్లా ఆడియో పంక్షన్ లు ప్లాన్ చేయటం ఎలా ఉంటుందని కొందరు ఆలోచిస్తున్నారు. అయితే అలా కాకుండా ఒక పాట అక్కడ..ఒక పాట ఇక్కడ అన్నట్లు రెండు చోట్లా సింపుల్ గా చేయ్యాలని 'ఒక లైలా కోసం' టీమ్ ప్లాన్ చేస్తోందని సమాచారం. ఈ మేరకు హైదరాబాద్ లో ఎప్పటిలాగే లాంచ్ చేస్తూ మరో రెండు పాటలను విజయవాడలోని పి.విపి మాల్ లో లాంచ్ చేస్తారని తెలుస్తోంది.

    సినిమా విషయానికి వస్తే...

    గుండె జారి గల్లంతైంది చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఒక లైలా కోసం'. నాగచైతన్య, పూజ హెగ్డే జంటగా నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నారు. సినిమా ప్రచారం చిత్రం ఇటీవల విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది.

    Oka Laila Kosam audio launch in Vijayawada

    దర్శకుడు మాట్లాడుతూ... ''అమ్మాయిలను పడేయడం ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసేంత ఈజీ'' అంటాడు ఆ యువకుడు. ''ఇలాగే అమ్మాయిల వెంట తిరిగి పాపాలు చేస్తే వచ్చే జన్మలోనూ అబ్బాయిల్లా పుడతారు'' అని శపిస్తుంది ఆ అమ్మాయి. వీరి గిల్లికజ్జాల కథేంటో తెలియాలంటే మా సినిమా చూడాలంటున్నారు.

    నిర్మాత మాట్లాడుతూ... ''ప్రేమకు రీజన్స్‌ ఉండవు. ఓన్లీ ఎమోషన్స్‌' అని నమ్మే యువకుడు. ప్రేమంటే ఆమడ దూరం ఉండే అమ్మాయి. తీపి, పులుపు లాంటి వీరి మధ్య విజయ్‌కుమార్‌ కొండా శైలిలో తెరకెక్కిన ప్రేమకథ ఇది. నేటి యువత మనసులు, ప్రేమలను తెరపై ఆవిష్కరిస్తున్నాం. త్వరలో పాటలను, వచ్చే నెల ఐదున చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ'' అంటున్నారు నిర్మాత.

    చిత్రంలో బ్రహ్మానందం, అలీ, ప్రభు, నాజర్‌, ఆశిష్‌ విద్యార్థి, దీక్షాపంత్‌ తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: ఐ.ఆండ్రూ, కళ: పి.ఎస్‌.వర్మ, కూర్పు: ప్రవీణ్‌పూడి.

    English summary
    Naga Chaitanya’s Oka Laila Kosam makers are planning to promote the film differently. The audio launch will be held on August 15th in Hyderabad. One of the songs will be launched in Hyderabad and two will be launched at PVP mall which is recently inaugurated in Vijayawada.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X