twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిజమైతే హరీష్ శంకర్ లక్కీనే

    By Srikanya
    |

    హైదరాబాద్: 'గబ్బర్ సింగ్'తో పవన్ కళ్యాణ్ కి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్. ఆ తర్వాత ఆయన రామయ్యా వస్తావయ్యా తో డిజాస్టర్ ఫ్లాప్ ని ఇచ్చారు. గబ్బర్ సింగ్ తో ఓవర్ నైట్ లో స్టార్ డైరక్టర్ హోదా సంపాదించిన హరీష్ ఆ సినిమా పరాజయంతో తర్వాత పెద్ద ఆఫర్స్ సంపాదించలేకపోయారు. అయితే ఆయన మళ్లీ పవన్ కళ్యాణ్ ని కథతో ఒప్పించినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. రీసెంట్ గా కథ,స్క్రీన్ ప్లే తో పవన్ ని మెప్పించారనవి, వచ్చే సంవత్సరం ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాసముందని వినపడుతోంది. ఖచ్చితంగా ఈ వార్త నిజమైతే హరీష్ శంకర్ లక్కీనే.

    ఇక రామయ్యవస్తావయ్యా ఫ్లాప్ తో డేట్స్ ఇస్తారనుకున్న పెద్ద హీరోలు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపధ్యంలో హరీష్...సాయి ధరమ్ తేజ తో చిత్రం మొదలు పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. త్వరలో ప్రారంభం కాబోయే ఈ చిత్రానికి లొకేషన్స్ నిమిత్తం యుఎస్ వెళ్లారు. సుబ్రమణ్యం ఫర్ సేల్ అనే టైటిల్ ని ఈ చిత్రానికి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

    Pawan Kalyan – Harish Shankar to team up again?

    పవన్‌ కల్యాణ్‌ విషయానికి వస్తే...ఆయన ఇప్పుడు 'గబ్బర్‌ సింగ్‌ 2' విషయంలోనూ తన ఆలోచనల్ని జోడించే పనిలో ఉన్నారు. 'గబ్బర్‌ సింగ్‌' సీక్వెల్‌కి రంగం సిద్ధమవుతోంది. శరత్‌ మరార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంపత్‌నంది దర్శకుడు. 'గబ్బర్‌ సింగ్‌ 2' స్క్రిప్టు విషయంలో పవన్‌ చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నాడు. కథ, స్క్రీన్‌ ప్లే విషయంలో 'పెన్ను' చేసుకొంటున్నాడు. ప్రస్తుతం 'గోపాల గోపాల' షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు పవన్‌.

    ఈ మల్టీస్టారర్‌ పూర్తవ్వగానే 'గబ్బర్‌ సింగ్‌ 2'కి కాల్షీట్లు కేటాయించనున్నాడు. అక్టోబర్‌ ద్వితీయార్థంలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈలోగా.. పవన్‌ దగ్గరుండి స్క్రిప్టు పనులు చూసుకొంటున్నాడు. మరోవైపు కథానాయిక, సాంకేతిక నిపుణుల ఎంపికా జరుగుతోంది. పవన్‌ సరసన కథానాయిక ఎవరనే సంగతి ఇంకొన్ని రోజుల్లో తెలుస్తుంది.

    English summary
    Now if everything goes well, Pawan Kalyan and Harish Shankar might team up for a new film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X