twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ కలగచేసుకుంటే కానీ ఒడ్డునపడదు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఆటోనగర్ సూర్య చిత్రం ఫైనాన్స్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొని,రిలీజ్ కు నానా కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఇదే దారిలో మరో చిత్రం సైతం ప్రయాణిస్తోంది. అది మరేదో కాదు..రేయ్ చిత్రం. వైవియస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రిలీజ్ కు ఫైనాన్సియర్స్ అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ కు ముందే పూర్తి ఫైనాన్స్ లు క్లియర్ చేయమని ఖచ్చితంగా చెప్పినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల వినికిడి. దాంతో ఇప్పుడు వైవియస్ చౌదరి...అంత పెద్ద మొత్తం క్లియర్ చేసి, విడుదల చేసే పార్టీ కోసం చూస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న అనిశ్చితి పరిస్ధితుల్లో అంతలా ఫైనాన్స్ ఇచ్చి ఆదుకునేవారు ఎవరూ లేరని, కేవలం తన మేనల్లుడనే అభిమానంతో పవన్ కళ్యాణ్ ...కలగచేసుకుని ఒడ్డున పడేయాలి తప్ప అని కొంతమంది విశ్లేషిస్తున్నారు.

    వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ 'ఇటీవలి కాలంలో యూత్‌ని టార్గెట్ చేస్తూ క్లాస్, ఫాస్ట్‌ఫుడ్ తరహా లవ్‌స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే 'దేవదాసు', 'దేశముదురు' తరహాలో భారీ స్థాయి మాస్, యూత్ లవ్‌స్టోరీలు రావడంలేదు. ఆ లోటుని తీర్చేవిధంగా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే రీతిలో 'రేయ్' తయారవుతోంది. కథానుగుణంగా ఈ చిత్రం ప్రథమార్థం వెస్టిండీస్ సంస్కృతి నేపథ్యంలో, ద్వితీయార్థం అమెరికా సంస్కృతి నేపథ్యంలో ఉంటుంది.

     Pawan will help to Rey movie?

    ఎఫ్.డి.సి. నిబంధనలకనుగుణంగా అమెరికా, వెస్టిండస్‌లో కొంత భాగం, హైదరాబాద్‌లో అత్యధిక భాగం షూటింగ్ చేశాం. భారీ నిర్మాణ విలువలు, ఆసక్తికరమైన కథాకథనాలతో పాటు అద్భుతమైన వినోదంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. తొలి సినిమాతోనే సాయిధరమ్ తేజ్ కచ్చితంగా స్టార్ హీరో అవుతాడనే నమ్మకం ఉంది. అలాగే సయ్యామి ఖేర్ తన అందంతో యూత్‌ని ఆకట్టుకుంటుంది. శ్రద్ధాదాస్ పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. ఇక పాటలన్నీ సందర్భోచితంగా, నాదైన గ్రాండియర్ స్టయిల్‌లో ఆకట్టుకుంటాయి' అని తెలిపారు.

    చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ కన్నా ఈ మేనల్లుడిలోనే చిరు పోలికలు బాగా ఉన్నాయి చిరంజీవి నట వారసత్వాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోగల సత్తా సాయి ధరమ్ తేజకే ఉన్నాయనిపిస్తోందన్న వాదనలను కూడా తీసుకవస్తున్నారు. చిత్రంలో అర్పిత్‌ రాంకా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, అలీ, నరేష్‌, జె.పి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: చక్రి, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: గుణశేఖరన్‌.

    English summary
    YVS Chowdary ran into financial troubles and now that financiers want him to clear everything before release, Rey is unable to see lime light, is what many film nagar folks say.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X