twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ దారి హీరోలిద్దరికీ దెబ్బకొట్టింది

    By Srikanya
    |

    హైదరాబాద్ : తెలుగులో ఓ సినిమా సూపర్ హిట్ అయ్యిందంటే అందరూ అలాంటి కథతోనే చిత్రాలు తయారు చేయాలని ఉత్సాహపడిపోతారు. దాంతో దాదాపు అన్ని కథలూ అదే మూసలో తయారవుతూంటాయి. ఫలితం ఏ సినిమాను సరిగా ఆడదు. అన్ని తెలిసిన కథలులాగానే కనిపించి ఆసక్తి రేపవు. ఇప్పుడు రామ్ కు, రామ్ చరణ్ కు అదే సమస్య ఎదురౌతోందని అంటున్నారు.

    వీరిద్దరూ అత్తారింటికి దారేది హిట్ కథ ఇచ్చిన ప్రేరతో సినిమాలు రెడీ చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు ఫిల్మ్ నగర్ వాసులు. ట్రీట్ మెంట్ తేడా ఉంటుందేమో కానీ కథ,కథనం ఒకేలాగ ఉన్నాయి...అందుకే ఇద్దరూ తమ తమ కథనాలును కొద్దిగా మార్చుకుంటున్నారు అని చెప్పుకుంటున్నారు. రామ్ పండగ చేస్కో, రామ్ చరణ్...గోవిందుడు అందరి వాడేలా చిత్రాలలో హీరోలు...ఎన్నారైలు. వాళ్లు తమ స్వగ్రామాలుకు వచ్చి విడిపోయిన తమ కుటుంబాలను కలుపే లక్ష్యంగా పనిచేస్తూంటారని తెలుస్తోంది. దాంతో ఇప్పుడు పండుగ చేస్కో టీమ్ ...గ్యాప్ తీసుకుని కథని సరిచేసుకునే పనిలో పడిందని చెప్తున్నారు.

     Problem with Ram's Pandaga Chesko movie story

    రామ్ హీరోగా రూపొందుతున్న 'పండగ చేస్కో' లో రామ్ ...ఎన్నారై గా కనిపిస్తాడని, అతను తన కుటుంబ సమస్య పరిష్కరించటానికి ఇండియా వస్తాడని తెలుస్తోంది. ఫస్టాఫ్ అత్తారింటికి దారేది,సెకండాఫ్ ...మిర్చిని గుర్తుకు తెస్తూ సాగుతుందని వినిపిస్తోంది. అయితే ఇది రూమరా లేక నిజమా అని తేలాలంటే సినిమా రిలీజ్ దాకా ఆగాల్సింది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ హీరో. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హీరోయిన్. పరుచూరి కిరీటి నిర్మాత.

    దర్శకుడు గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ... డాలర్లలో మునిగి తేలిన కుర్రాడతను. కోరుకొంటే విలాసవంతమైన జీవితం అతని కాళ్ల ముందు ఉంటుంది. కానీ అదేం వద్దనుకొన్నాడు. తన వాళ్ల కోసం స్వదేశానికి వచ్చేశాడు. ఇక్కడికొచ్చి ఏం చేశాడో తెలియాలంటే మా చిత్రం చూడాలి అంటున్నారు . ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పండగ చేస్కో'.

    అలాగే ''రామ్‌ ఎనర్జీని పూర్తి స్థాయిలో తెరపై చూపించే ప్రయత్నమే ఈ చిత్రం. రకుల్‌ పాత్ర కూడా అదే స్థాయిలో ఉంటుంది. హీరో,హీరోయిన్స్, బ్రహ్మానందం కలసి తెరపై పండించే వినోదం ప్రేక్షకులను అలరిస్తుంది'' అన్నారు. రామ్‌ మాట్లాడుతూ ''చాలా రోజుల నుంచి కష్టపడి చేసుకున్న కథ ఇది. మా చిత్రబృందం ఎంతో మనసు పెట్టి చేస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు.

    నిర్మాత మాట్లాడుతూ... ''తనవారి శ్రేయస్సు కోసం పాటుపడే కుర్రాడి కథ ఇది. ప్రతి సన్నివేశం ఓ పండగలా ఉంటుంది. రామ్‌ నటన, డ్యాన్స్‌, పోరాటాలూ.. తప్పకుండా ఆకట్టుకొంటాయి. సాయికుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. రామ్‌తో సినిమా చేయాలని గత నాలుగేళ్లగా ప్రయత్నించాను. ఈ కథ నా దగ్గరకు వచ్చేసరికి పరిశ్రమ పరిస్థితి బాగాలేదని ఆలోచించాను. అయితే కథ బాగా నచ్చేసరికి ముందడుగు వేశాను'' అన్నారు.

    సోమవారం నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలుకానుంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. చిత్రంలో సాయికుమార్‌, రావు రమేష్‌, జయప్రకాశ్‌రెడ్డి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్థర్‌ ఎ.విల్సన్‌, సంగీతం: తమన్‌, కూర్పు: గౌతంరాజు, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌

    English summary
    In "Pandaga Chesko" movie Ram plays a NRI, millionaire who comes back to India. Rakul Preet Singh is the female lead in this film. Brahmanandam is playing a good role and Jagapathi Babu will be seen in a prominent role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X