twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దిల్ రాజు గెస్ట్ రోల్ చేసాడు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత దిల్ రాజు...తెర వెనకే ఉంటూ విజయాలు తన స్వంతం చేసుకుంటూ ప్రయాణం సాగిస్తున్నాడు. ఆయన్ను తెర మీదకు కోన వెంకట్ లాక్కొని వచ్చాడని సమాచారం. కోన వెంకట్ సమర్పిస్తన్న గీతాంజలి చిత్రంలో దిల్ రాజు...ఓ చిన్న గెస్ట్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. సినిమాలో కీలకంగా ఉండే ఈ సన్నివేశంలో దిల్ రాజు..తన నిజ జీవిత పాత్రనే అంటే నిర్మాతగానే కనిపిస్తాడని చెప్పుకుంటన్నారు.

    శ్రీనివాస రెడ్డి ఈ చిత్రంలో సిని రచయితగా కనిపిస్తాడని...అతను కథలు పట్టుకుని తిరిగే క్రమంలో దిల్ రాజుని కలుస్తాడని అంటున్నారు. అయితే దిల్ రాజు వల్ల కథ ఓ కంక్లూజన్ వస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే దిల్ రాజు...ఈ చిత్రం...నైజం,వైజాగ్ ఏరియాలు తీసుకుని విడుదల చేస్తున్నారు. ఈ హర్రర్ కామెడీ ఖచ్చితంగా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే వదిలిన ఈ చిత్రం ట్రైలర్స్ , పోస్టర్స్ ఈ చిత్రంపై మంచి అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి.

    Producer Dil Raju's cameo role

    'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో తన అమాయకపు చూపులు, ముద్దుముద్దు మాటలతో ప్రేక్షకులను అలరించిన అంజలి తొలిసారి చేస్తోన్న హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమా కావడంతో దీనిపై ఇండస్రీ వర్గాలు దృష్టి సారిస్తున్నాయి. ఒకప్పుడు 'తోకలేని పిట్ట'తో నిర్మాతగా పరిచయమై, తర్వాత కాలంలో రచయితగా పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్న కోన వెంకట్‌ ఈ సినిమాకి స్ర్కీన్‌ప్లే, మాటలు అందిస్తుండటమే కాకుండా, సమర్పకునిగా వ్యవహరిస్తుండటంతో బిజినెస్‌ వర్గాలు దీనిపై ఆసక్తిని కనపరుస్తున్నాయి.

    శ్రీనివాసరెడ్డి, రాజ్‌కిరణ్ మంచి కథ కథనంతో ఈ చిత్రాన్ని రూపొందించడానికి తన వద్దకు వచ్చినప్పుడు మంచి కథగా అనుకున్నానని, హారర్ కథకు కామెడీని జోడిస్తే ఎలా వుంటుందో ఈ చిత్రం అలా వుంటుందని, అంజలి ఈ చిత్రంలో విభిన్నమైన రెండుకోణాల్లో నటించిందని చిత్ర సమర్పకుడు కోన వెంకట్ తెలిపారు. బ్రహ్మానందం పాత్ర సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ సినిమాని వచ్చేనెల 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు.

    అలీ, రఘుబాబు, సత్యం రాజేష్, ఝాన్సీ, రావూరమేష్, హర్షవర్థన్ రాణె, వెనె్నల కిశోర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: శ్రీజో, ఎడిటింగ్: ఉపేంద్ర, కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, మాటలు, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, కథ, దర్శకత్వం: రాజ్‌కిరణ్.

    English summary
    
 Dil Raju is appearing in a cameo role which will come at a crucial point in Geethanjali film. Dil Raju himself releasing the movie in Nizam and Vizag.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X