twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ న్యూస్ : 'రభస' రిలీజ్ డేట్ మారింది

    By Srikanya
    |

    హైదరాబాద్ : జూ. ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న 'రభస' సినిమా షూటింగ్ పూర్తై రిలీజ్ కు సిద్దమవుతున్న సంగతీ తెలిసిందే. ఈ చిత్రం ని మొదట ఆగస్టు 14వ రిలీజ్ చేయాలనుకున్నారు కానీ దానిని ఒకరోజు ముందుకు తోసి ఆగష్టు 15న రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎన్.టి.ఆర్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు.

    యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కామెడీ పూర్తి ప్రాధాన్యత ఉందని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి బెల్లంకొండ సురేష్ నిర్మాత. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం ఆడియోని ఆగస్టు 1 శిల్పకళా వేదికలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే రోజున ఈ చిత్రం టీజర్ విడుదల అవుతుంది.

    Rabhasa - A New Date Is Fixed

    దర్శకుడు మాట్లాడుతూ... ''ఎన్టీఆర్‌ నుంచి రాబోతున్న మరో వినోదాత్మక యాక్షన్‌ తరహా చిత్రమిది. కథానాయకుడి పాత్ర చిత్రణ, కథ నడవడిక వైవిధ్యంగా ఉంటాయి'' అన్నారు.

    అలాగే హీరోగా ప్రేక్షకుల మన్ననలను పొందిన ఎన్టీఆర్‌ ఇప్పుడు డ్యాన్స్‌ మాస్టర్‌ అవుతున్నారు. ఫిల్మ్‌నగర్‌లో ఇప్పుడు ఇదే టాక్‌. 'రభస' సినిమా ఇంట్రడక్షన్‌ పాట కోసం ఎన్టీఆర్‌ నృత్య రీతులు సమకూర్చారు. అయితే ఈ విషయమై ఇంతవరకూ చిత్రబృందం నుంచి కచ్చితమైన సమాచారం లేదు.

    ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

    English summary
    Bellamkonda Suresh has finally fixed August 15th as the release date of the movie 'Rabhasa'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X