Englishবাংলাગુજરાતીहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

అల్లు అర్జున్ టైటిల్ తో రామ్ చిత్రం?

Posted by:
Published: Friday, February 14, 2014, 9:07 [IST]
 

హైదరాబాద్: హీరో రామ్ తో మలినేని గోపిచంద్ దర్శకత్వంలో యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి ప్రసాద్ సమర్పణలో యువ నిర్మాత పరుచూరి కిరీటి ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్ 'పండగ చేసుకో' అని పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ లో సైతం రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ టైటిల్ ని గతంలో అల్లు అర్జున్ కోసం అనుకోవటం జరిగింది.

గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ''రామ్‌లోని హుషారుకి తగిన కథ ఇది. మాస్‌, యాక్షన్‌, వినోదం.. ఇవన్నీ కలగలిసి ఉంటుంది. డాన్‌శీను', ‘బాడీగార్డ్', ‘బలుపు' వంటి హిట్ చిత్రాల తరువాత చేస్తున్న సినిమా ఇది. రామ్ ఎనర్జీకి తగినట్లుగా మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించడానికి సబ్జెక్ట్ రెడీ చేశాం. రామ్‌కిది మరో మంచి సినిమా అవుతుంది' అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ... ''స్క్రిప్టు బాగా వచ్చింది. రామ్‌ కెరీర్‌లో మర్చిపోలేని చిత్రం అవుతుంది. హీరోయిన్, మిగిలిన సాంకేతిన నిపుణుల వివరాలు త్వరలో చెబుతాము''అన్నారు . వరసగా మూడు డిజాస్టర్ ఫ్లాపులు(ఎందుకంటే ప్రేమంట,ఒంగోలు గిత్త,మసాలా) అందించిన రామ్ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు.

రామ్ మాట్లాడుతూ... నాకు స్క్రిప్ట్ నచ్చితే ఏడాది దాటాక కూడా చిన్న చిన్న విషయాలు చెప్పగలను. నాకు నచ్చకపోతే చిన్న విషయం కూడా చెప్పలేను. ఎవరైనా స్క్రిప్ట్ చెప్తుంటే నాలుగైదు విధాల ద్వారా ఆలోచిస్తాను. కధ చెప్పే వాడు ఆరవ విధంగా చెప్తే నాకు నచ్చుతుంది. నాకు ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టం అన్నారు.

ఫ్లాపులు గురించి మాట్లాడుతూ.. నేను బాధపడనని చెప్పలేను. కాకపోతే తప్పక హిట్ అవుతుందన్న సినిమా ఫ్లాప్ అయితే బాధ వేస్తుంది సినిమా ఒప్పుకునే ముందు స్క్రిప్ట్ నూ దర్శకుడినో నమ్ముతాను లేదా నమ్మిస్తారు. ఒక్కోసారి దర్శకుడు చెప్పిన విషయం నాకు నచ్చకపోయినా అతని మీద నమ్మకంతో ఒప్పుకుంటాను. కానీ ఒకోసారి అవి ఫలించవు. జగడం తరువాత నేను చాలా భాధలో వున్నాను. "ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో ఒప్పుకోకపోతే ఎంత బాధ వస్తుందో అంతా బాధగా". నా కెరీర్ లో చాలా ఒడిదుడుకులు ఎదురుకున్నా. నేను స్టాక్ మార్కెట్ లాంటి వాడిని. ప్రస్తుతం నా తప్పులను తెలుసుకుని నేను ఆనందంగా వున్నాను అని చెప్పుకొచ్చారు.

ఇక ప్రయోగాత్మక సినిమాల గురించి చెప్తూ..అందరి దర్శకులకి నన్ను చూస్తే ప్రయోగాలు చెయ్యాలనిపిస్తుంది. ఉదాహరణకు నేను కరుణాకరన్ తో ప్రేమకధను చేయాలనుకున్నా. కానీ అతను నాతొ వేరే విధమైన సినిమా తీసాడు. ఇదివరకే ఇలాంటివి మరొకటి జరిగింది. నేను దర్శకులను ఉత్తేజపరచడం నాకు నచ్చింది. చిన్న బడ్జెట్ సినిమాల విషయానికొస్తే మనకి భారీ నిర్మాణ విలువలతో, భారీ సెట్లనడుమ చూడడం ఇష్టం. తమిళ మరియు మలయాళం వారికి వేరే సంస్కృతి. ఎవరి ఇష్టాలు వాళ్ళకి వుండడం సహజం అన్నారు.

English summary
A tentative title of Ram's upcoming film is doing rounds in Film Nagar and it happens to be 'Pandaga Chesko'.
మీ వ్యాఖ్య రాయండి

Please read our comments policy before posting

Click here to type in Telugu
Subscribe Newsletter
Coupons
My Place My Voice