Englishবাংলাગુજરાતીहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

కొత్త చిత్రానికి రవితేజ రెమ్యునేషన్ అంతా?

Posted by:
Updated: Thursday, December 12, 2013, 16:55 [IST]
 

కొత్త చిత్రానికి రవితేజ రెమ్యునేషన్ అంతా?
 

హైదరాబాద్ : బాబీ దర్శకత్వంలో రూపొందబోయే రవితేజ కొత్త చిత్రం నిన్న బుధవారం ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం రవితేజ అక్షరాలా ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. వైవియస్ చౌదరి తో మొదటి ఈ ప్రాజెక్టు అనుకున్నా...తను అనుకున్న రెమ్యునేషన్ సెట్ కాలేదని ఒప్పుకోలేదని చెప్తున్నారు. అవసరమైతే కొంతకాలం ఖాళీగా ఉన్నా ఫవరాలేదు కానీ...తను అనుకున్న రెమ్యునేషన్ కి తగ్గకూడదని ఫిక్స్ అయినట్లు చెప్తున్నారు.


రవితేజ హీరోగా రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హన్సిక హీరోయిన్. కె.ఎస్‌.రవీంద్రనాథ్‌ (బాబి) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. ఈ చిత్రంలో రవితేజ ..పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం. రవితేజ సూపర్ హిట్ విక్రమార్కుడుని పోలిన కథతో ఈ చిత్రం తెరకెక్కుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. డ్యూయిల్ రోల్ పాత్రను మరోసారి పోషిస్తున్నాడని,అయితే పూర్తి స్ధాయి ఎంటర్ట్నైమెంట్ తో ట్రీట్ మెంట్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ఈ చిత్రానికి జింతాత ..జింతాత అనే టైటిల్ పెట్టే అవకాసముందని సమాచారం.


రవితేజ మాట్లాడుతూ ''నాలుగేళ్ల క్రితం నుంచి రాక్‌లైన్‌ వెంకటేష్‌తో పరిచయముంది. మంచి కథ దొరికితే ఇద్దరం కలిసి సినిమా చేయాలనుకొన్నాం. అది ఇప్పటికి కుదిరింది. బాబీ తయారు చేసిన కథ చాలా బాగుంది. అతనితో 'బలుపు' సమయంలోనే పరిచయం ఏర్పడింది. అప్పుడే ఈ కథ గురించి చెప్పాడు. బాగా నచ్చింది. అతని రూపంలో ఇంకొక కొత్త దర్శకుడు పరిచయం అవుతుండడం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటివాళ్లు మరింత మంది రావాలి'' అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ''బలుపు' చిత్రంతో నన్నొక రచయితగా ప్రోత్సహించారు రవితేజ. ఇప్పుడు దర్శకుడిని చేశారు. ఇది నాకు ఓ పెద్ద బాధ్యత. కసి ఉన్న ప్రతి ఒక్కరినీ పిలిచి అవకాశమిచ్చే మనస్తత్వం రవితేజది. ఇకపై కూడా ఆయన ఇలాగే మరింతమందికి అవకాశమిచ్చేలా ఈ సినిమాను తీస్తాను. మంచి సాంకేతిక బృందం కుదిరింది. తమన్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండటం ఎంతో ఆనందంగా ఉంది. రవితేజ చేసిన ఇదివరకటి సినిమాలకి భిన్నంగా ఇందులో సంగీతం ఉంటుంది'' అన్నారు.

''తెలుగులో ఇదే నా మొదటి చిత్రం. రవితేజతో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకొంటున్నాను. బాబీ కథతో అది కుదిరింది. 'విక్రమార్కుడు' తరహాలో అందరికీ నచ్చేలా ఉంటుందీ చిత్రం. దీన్ని కన్నడతో పాటు ఇతర భాషల్లో కూడా రీమేక్‌ చేయబోతున్నాం'' అన్నారు నిర్మాత.

''ప్రతిభావంతుల్ని ప్రోత్సహించడంలో ముందుంటారు రవితేజ. బాబీ తయారు చేసిన ఈ కథ చాలా బాగుంది. 'బలుపు' స్ఫూర్తితో ఈ చిత్రానికి పనిచేయబోతున్నాం'' అన్నారు మాటల రచయిత కోన వెంకట్‌. బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, ముఖేష్‌ రుషి, రావు రమేష్‌, సంపత్‌, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖావాణి, జోగిబ్రదర్స్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: ఆర్థర్‌ ఎ.విల్సన్‌, కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే: కె.చక్రవర్తి, మోహనకృష్ణ.

Story first published:  Thursday, December 12, 2013, 16:43 [IST]
English summary
Ravi Teja is who is back on success track with “Balupu ” is now hike his salary for his project. As per reports he offers 7cr remunerations for his latest project.
మీ వ్యాఖ్య రాయండి

Please read our comments policy before posting

Click here to type in Telugu
Subscribe Newsletter
Coupons
My Place My Voice