twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విషయం పవన్ కళ్యాణ్ దాకా వెళ్లింది, సీరియస్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ విషయంలో అయినా నిక్కచ్చిగా ఉంటారు. ఏదైనా తేడా వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాధారణంగా ఆయన తన పనేదో తాను చేసుకుపోవడం తప్ప ఇతర అనవసర విషయాలను పెద్దగా పట్టించుకోరు. అయితే తన అక్క కొడుకు సాయి ధరమ్ తేజ్ తెరంగ్రేటం విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ముందు నుండి శ్రద్ద తీసుకుంటున్నారు.

    పవన్ కళ్యాణ్ అనుమతితోనే దర్శకుడు వైవిఎస్ చౌదరి సాయి ధరమ్ తేజ్ హీరోగా 'రేయ్' చిత్రాన్ని తెరకెక్కించారు. మధ్యలో ఆ సినిమాకు సమస్యలు వస్తే చొరవ తీసుకున్నారు. అయితే సినిమా విడుదల విషయం లేటవుతుండటంతో పవన్ కళ్యాణ్ కాస్త అసహంగా ఉన్నట్లు తెలుస్తోంది. 'రేయ్' విడుదల లేటయితే సాయి ధరమ్ తేజ్ కెరీర్ పై ప్రభావం పడే అవకాశం ఉందని, వీలైనంత త్వరగా సినిమా విడుదల చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని దర్శకుడిపై సీరియస్ అయినట్లు ఫిల్మ్ నగర్ టాక్.

    మెగా ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అవుతున్న సాయి ధరమ్ తేజ్ కు ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీలో ఏ హీరో పూడనన్నికస్టాలు పడుతున్నాడు. ఆయన నటించిన తొలి చిత్రం 'రేయ్' సంవత్సరాలు గడుస్తున్నా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. 2010లో ప్రారంభమైన ఈ చిత్రం అష్టకష్టాలు పడి 2013 నాటికి పూర్తయినా.....విడుదల విషయంలో కూడా తీవ్రమైన జాప్యం జరుగుతోంది. మెగా ఫ్యామిలీ హీరో పరిస్థితి ఇలా ఉంటే...ఇతర సాధారణ హీరోల పరిస్థితి ఏమిటనే చర్చ సాగుతోంది.

    Rey: Pawan Kalyan unhappy

    ప్రతీసారీ ఏదో ఒక కారణం చెప్పి సినిమా రిలీజ్ ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు దర్శకుడు వైవియస్ చౌదరి. ఈ సారి ఎట్టిపరిస్ధితుల్లోనూ మే 9 న విడుదల చేద్దామని నిర్ణయించుకున్నామని ఆ మధ్య ఆర్భాటంగా ప్రకటించారు. ఆ తేదీ దాటి నాలుగు నెలలు దాటినా సినిమా కనీసం విడుదలకు నోచు కోవడం లేదు. కనీసం ఎప్పుడు విడుదలవుతుందనే స్పష్టత కూడా ఇప్పటి వరకు రాలేదు. అసలు 'రేయ్' సినిమా వార్తల్లోనే లేదు.

    అయితే మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా సినిమా గురించి గొప్పగా చెబుతు అభిమానుల్లో ఆశలు రేపుతున్నాడు వైవిఎస్ చౌదరి. ఆ మధ్య ఆయన మాట్లాడుతూ 'ఇటీవలి కాలంలో యూత్‌ని టార్గెట్ చేస్తూ క్లాస్, ఫాస్ట్‌ఫుడ్ తరహా లవ్‌స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే 'దేవదాసు', 'దేశముదురు' తరహాలో భారీ స్థాయి మాస్, యూత్ లవ్‌స్టోరీలు రావడంలేదు. ఆ లోటుని తీర్చేవిధంగా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే రీతిలో 'రేయ్' తయారవుతోంది. కథానుగుణంగా ఈ చిత్రం ప్రథమార్థం వెస్టిండీస్ సంస్కృతి నేపథ్యంలో, ద్వితీయార్థం అమెరికా సంస్కృతి నేపథ్యంలో ఉంటుంది. ఎఫ్.డి.సి. నిబంధనలకనుగుణంగా అమెరికా, వెస్టిండస్‌లో కొంత భాగం, హైదరాబాద్‌లో అత్యధిక భాగం షూటింగ్ చేశాం. భారీ నిర్మాణ విలువలు, ఆసక్తికరమైన కథాకథనాలతో పాటు అద్భుతమైన వినోదంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. తొలి సినిమాతోనే సాయిధరమ్ తేజ్ కచ్చితంగా స్టార్ హీరో అవుతాడనే నమ్మకం ఉంది అన్నారు.

    అలాగే సయ్యామి ఖేర్ తన అందంతో యూత్‌ని ఆకట్టుకుంటుంది. శ్రద్ధాదాస్ పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. ఇక పాటలన్నీ సందర్భోచితంగా, నాదైన గ్రాండియర్ స్టయిల్‌లో ఆకట్టుకుంటాయి' అని తెలిపారు. చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ కన్నా ఈ మేనల్లుడిలోనే చిరు పోలికలు బాగా ఉన్నాయి చిరంజీవి నట వారసత్వాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోగల సత్తా సాయి ధరమ్ తేజకే ఉన్నాయనిపిస్తోందన్న వాదనలను కూడా తీసుకవస్తున్నారు. చిత్రంలో అర్పిత్‌ రాంకా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, అలీ, నరేష్‌, జె.పి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: చక్రి, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: గుణశేఖరన్‌.

    English summary
    Chiranjeevi's nephew Sai Dharam Tej first film, 'Rey', is facing many problems regarding the release and has been lying in the cans for a long time. Pawan Kalyan is very unhappy with the director cum producer Chowdary.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X