Englishবাংলাગુજરાતીहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ప్రభాస్ సైతం సంపూర్ణేష్ బాబు క్రేజ్ చూసి...

Posted by:
Published: Tuesday, April 8, 2014, 11:49 [IST]
 

హైదరాబాద్ : మొన్న శుక్రవారం విడుదలైన హృదయకాలేయం చిత్రం క్రేజ్ ఇప్పుడు ప్రభాస్ దాకా పాకింది. ప్రభాస్ ఈ చిత్రం గురించి విని, తెలుసుకుని దర్శకుడుని, నిర్మాతని తనకో కాపీ పంపమని,తను ఇంటివద్ద తన ఫ్యామిలీతో కలిసి చూస్తానని చెప్పినట్లు సమాచారం. కేవలం ప్రభాస్ మాత్రమే కాక చాలా మంది ఇండస్ట్రీలో ఈ చిత్రం గురించి చర్చించుకోవటం కనిపిస్తోంది. జగపతిబాబు ఇప్పటికే ఈ చిత్రం చూసాడని తెలుస్తోంది.

అమృత క్రియేషన్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో స్టీవెన్ శంకర్ నిర్మించిన ఈ చిత్రంలో కావ్య కుమార్, ఇషికాసింగ్ హీరోయిన్స్. రీసెంట్ గా రిలీజైన ఈ చిత్రం యూ ట్యూబ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. సినిమా టీజర్ యూట్యూబ్‌లో పదిలక్షల వ్యూస్‌కు చేరువై సంచలనం రేపటం సినిమాకు ప్లస్ అయ్యింది. ఇంతకీ ఈ చిత్రం దర్శకుడు ఎవరు...స్టీవెన్ శంకర్ అనేది అతని అసలు పేరేనా అంటే కాదు అని చెప్తున్నారు. ఈ విషయమై దర్శకుడు మీడియాతో మాట్లాడారు.

ప్రభాస్ సైతం సంపూర్ణేష్ బాబు క్రేజ్ చూసి...

దర్శకుడు మాట్లాడుతూ... "నిజానికి ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్లు నా పేరు స్టీవెన్‌శంకర్ కాదు. అసలుపేరు సాయిరాజేష్. హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్, తమిళడైరెక్టర్ శంకర్ పేర్లను కలిపి అలా పెట్టుకున్నానంతే! ఆమాటకొస్తే సంపూర్ణేష్‌బాబుదీ ఆ పేరు కాదు. అసలు పేరును అతను చెప్పొద్దు అంటున్నాడు కాబట్టి నేను చెప్పడం లేదు '' అన్నారు స్టీవెన్.

హీరో మాట్లాడుతూ ''ఇది ఏ చిత్రానికీ వ్యంగ్యరూపం కాదు. కుటుంబం మొత్తం చూడదగ్గ ప్రేమకథా చిత్రమిది. దర్శకుడు స్టీవెన్‌ శంకర్‌ సినిమాను తెరకెక్కించిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. యాక్టర్ కావాలనేది నా కల. కథ వినగానే సినిమా చేయడానికి సిద్ధమయ్యాను. తొలి పోస్టర్‌తోనే మా సినిమాకు గుర్తింపురావడానికి కారణం రాజమౌళిగారు. ఆయనకు మేం రుణపడి ఉంటాం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా టాలెంట్ ఉంటే ఎదగొచ్చు'' అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ''దక్షిణ అమెరికా, జర్మనీలో విడుదలవుతున్న తొలి తెలుగు చిత్రమిది. ప్రతి సన్నివేశం హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది. పక్కా కమర్షియల్ సినిమా ఇది. సినిమాను 29 రోజుల్లో పూర్తి చేశాం. నా టీమ్ లేకపోతే ఈ సినిమా లేదు. అందుకే నేను ఎ ఫిల్మ్ బై అని నా పేరు వేసుకోలేదు'' అన్నారు.


ఇక సినిమా హీరో ఎంపిక గురించి చెప్తూ... "హీరో అవ్వడానికి ఎటువంటి క్వాలిటీస్ ఉండకూడదు. ఫిజికల్ ఫీచర్స్ కూడా హీరోకు ఉన్నట్లు ఉండకూడదు. అయితే- టాలెంట్‌వైజ్‌గా హీరో ఏం చేస్తాడో అది చెయ్యగలగాలి. అలాంటి విచిత్రమైన హీరో కోసం వెదికాను. ఎక్కడా దొరకలేదు. ప్రసాద్‌ల్యాబ్‌లో ఏదో ప్రివ్యూ వేస్తుంటే చూద్దామని ఒక రోజున వెళితే - అక్కడ కనిపించాడు ఈ హీరో. రంగురంగుల బొమ్మలతో బిగుతుగా ఉండే ఎర్రటి టీషర్టు తొడుక్కుని చేతులు కాళ్లను విసురుకుంటూ నడుస్తూ వచ్చాడు. అతని వాలకం చూసిన క్షణమే 'దొరికాడ్రా నాకు హీరో' అనుకున్నాను..'' చెప్పాడు స్టీవెన్‌శంకర్.

English summary
Prabhas has asked the director and producer of Hrudaya Kaleyam to send him a copy of the film to watch with his family at home.
మీ వ్యాఖ్య రాయండి

Please read our comments policy before posting

Click here to type in Telugu
Subscribe Newsletter
Coupons
My Place My Voice