twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "గబ్బర్ సింగ్ " రెమ్యునేషన్ ఇంకా పెండింగ్ లోనే ?

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఓ ప్రక్కన గబ్బర్ సింగ్ 2 ప్రారంభం కాబోతోంది. అయితే ఇంకా గబ్బర్ సింగ్ కు చెందిన పేమెంట్స్ ఇంకా క్లియర్ కాలేదని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రం "గబ్బర్ సింగ్ ". ఈ చిత్రం నిర్మాత బండ్ల గణేష్. ఆయన శృతి హాసన్ రెమ్యునేషన్ లో కొంత పెండింగ్ లో పెట్టారనే వార్త అంతటా వినపడుతోంది. అందుకే శృతిహాసన్ ని రామ్ చరణ్ సరసన కృష్ణ వంశీ దర్శకత్వంలో చిత్రానికి అడిగినా డేట్స్ ఇవ్వలేదని అంటున్నారు. కృష్ణ వంశీ ఆమెను మొదటి ఛాయిస్ గా అనుకుని స్క్రిప్టు సైతం వినిపించాడని అయితే పాత బాకీల నేపధ్యంలో ఆమె డ్రాపయిందని చెప్తున్నారు. ఈ విషయం నిజమా కాదా అనే విషయం..శృతి హాసన్ లేదా బండ్ల గణేష్ స్వయంగా చెపితే కానీ బయిటకు రాదు. ఇంతకీ ఆమెకు ఇవ్వాల్సిన మొత్తం ఎనిమిది లక్షలు అని చెప్పుకుంటున్నారు.

    ఇక రీసెంట్ గా శ్రుతి హాసన్ మళ్లీ గొంతు సవరించుకుంది. అల్లు అర్జున్‌ తో ఆమె చేస్తున్న 'రేసుగుర్రం' లో ఆమె ఓ పాట పాడింది. ఇందులో 'డౌన్‌ డౌన్‌ డుప్పా..' అంటూ సాగే ఓ గీతాన్ని శ్రుతిహాసన్‌ ఆలపించింది. ఈ పాటకి అల్లు అర్జున్‌తోపాటు ఆమె కూడా డ్యాన్స్‌ చేసింది. ఈ పాటని రామోజీఫిల్మ్‌సిటీలో చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్‌ నృత్య దర్శకుడు ఫిరోజ్‌ఖాన్‌ నృత్యరీతులు సమకూరుస్తున్నారు.

    Shruti's Gabbar Singh payment still pending?

    గబ్బర్ సింగ్, బలుపు చిత్రాలతో ఫామ్ లోకి వచ్చిన శ్రుతి ..అటు హీరోయిన్ గా...అదరకొడుతూనే మరో ప్రక్క పాటలు పాడే కార్యక్రమం కూడా పెట్టుకుంది. తాజాగా ఆమె తమిళంలో ఓ పాట పాడింది. తెలుగులో హిట్టైన అలా మొదలైంది చిత్రం రీమేక్ గా రూపొందుతున్న చిత్రంలో ఆమె చేత ఓ పాటను పాడించారు. షటప్ యువర్ మౌత్ అంటూ సాగే ఈ పాట బాగా వచ్చిందని, అది హిట్టై ఆమెను అందరూ తమి సినిమాల్లో ఒక పాటపాడమని అడుగుతారని దర్శకుడు చెప్తున్నారు.

    ఇక అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'రేసు గుర్రం'. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న తొలి సినిమా ఇదే. టైటిల్ కు తగ్గట్లు రేసు గుర్రంలాగానే ఈ చిత్రం విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. చిత్రంలో అల్లు అర్జున్ క్యారక్టరైజేషన్ చాలా విభిన్నంగా ఉండబోతోందని దర్శకుడు చెప్తున్నాడు. ఫన్,యాక్షన్ కలిపి మరో కిక్ లా రూపొందిస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి.

    సురేంద్రరెడ్డి మాట్లాడుతూ... "పరుగు పందెంలో గెలవడం రేసుగుర్రం విధి. జీవితమనే పరుగు పందెంలో గెలవడం మనిషి విధి. అయితే... ఈ రేసులో అడపాదడపా గెలిచేవారు కొందరైతే... గెలుపుని ఇంటిపేరుగా మార్చుకున్నవాళ్లు కొందరు. ఆ కొందరిలో ఒకడి కథే... 'రేసుగుర్రం. బాధ్యతాయుతమైన ఓ యువకుని కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు" అన్నారు.

    నిర్మాతలు మాట్లాడుతూ... "గెలుపు కోసం బరిలో దిగినవాడికి... లక్ష్యం మాత్రమే కనిపించాలి. ఎదురొస్తున్న సవాళ్లు, పరిగెట్టిస్తున్న పరిస్థితులు, చుట్టుముడుతున్న సమస్యలూ ఇవేమీ పట్టించుకోకూడదు. రేసులో నిలవాలన్నా, నిలిచి గెలవాలన్నా పోరాడాల్సిందే. ఆ యువకుడూ అదే చేశాడు. 'రేసు గుర్రం'లా దూసుకుపోయాడు. మరి విజయం అందిందా? లేదా? ఇంతకీ ఈ రేసు దేని కోసం? తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే!" అన్నారు.

    ఇద్దరమ్మాయిలతో... సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయం చెందిన తరువాత బన్ని చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్‌ కొట్టాలని భావిస్తున్నాడు. అలాగే ఊసరవెల్లి సినిమా తరువాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఇతనికీ ఈ సినిమా విజయం ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే ఊసరవెల్లి అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.ఈ చిత్రంలో సలోని సెకండ్ హీరోయిన్‌గా కనిపించనుంది.

    కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.

    English summary
    
 Bandla Ganesh didn't give full remuneration to Shruti for her work in "Gabbar Singh".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X