twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెక్ బౌన్స్ అయ్యేంతలా ఖర్చు పెట్టిందా?

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'గబ్బర్‌సింగ్‌' విజయంతో వరుస అవకాశాలు అందుకొంది శ్రుతిహాసన్‌. 'బలుపు', 'ఎవడు', 'రామయ్యా వస్తావయ్యా'లాంటి భారీ చిత్రాలు చేసింది. 'బలుపు' , 'ఎవడు' విజయం సాధించింది. అలా మంచి జోరు మీద ఉన్న శృతి ఫైనాన్సియల్ గానూ మంచి స్ట్రాంగ్ గానే ఉంటుందని భావిస్తారు. అయితే ఆమె ఇచ్చిన చెక్ ..ఈ మధ్యన బౌన్స్ అయ్యిందని ముంబై వర్గాల సమాచారం. ఈమె ముంబై లో ఇల్లు కొనుక్కుందని అందుకోసం ఆమె డబ్బు ఎడ్జెస్ట్ చేసే ప్రాసెస్ లో చెక్ ఇచ్చిందని అది బౌన్స్ అవటంతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. అయితే శృతి హాసన్ చెక్ బౌన్స్ అవటమేంటి...అని ఆమె సన్నిహితులు ఆశ్చర్యపోతున్నారు.

    ఇక ప్రస్తుతం అర్జున్‌ రామ్‌పాల్‌, శ్రుతిహాసన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం 'డి డే'. నిఖిల్‌ అద్వానీ దర్శకత్వం వహించారు. శృతి హాసన్ వేశ్య పాత్రను పోషించింది. అర్జున్‌ రామ్‌పాల్‌ - శ్రుతిల మధ్య ఘాటైన సన్నివేశాలున్నాయి. ఈ చిత్రాన్ని 'గెలుపు గుర్రం' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు సురేష్‌ దూడల.

    Shrutihassan cheque bounced

    ఆయన మాట్లాడుతూ ''మాఫియా నేపథ్యంలో సాగే కథ ఇది. శ్రుతిహాసన్‌ వేశ్యగా నటించింది. ఆమె పాత్ర యువతరాన్ని ఆకట్టుకుంటుంది. ఇందులో గెలుపు గుర్రం ఎవరన్నది తెరపైనే చూడాలి. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాము'' అన్నారు.

    అప్పట్లో ఈ చిత్రం ఫస్ట్ లుక్ హాట్ టాపిక్ గా మారి సినిమాకు బోల్డ్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు దాన్నే క్యాష్ చేసుకుందామనే ఆలోచనతోనే నిర్మాతలు తెలుగులో డబ్బింగ్ చేస్తున్నట్లు చెప్తున్నారు. గతంలో తమిళంలో డబ్బింగ్ అవబోతే శృతి హాసన్...కోర్టు...కేసు లు అంటూ సీరియస్ అయ్యింది. ఇప్పుడు అదే పరిస్ధితి తెలుగులోనూ రాబోతోందా అంటున్నారు. ఇప్పుడిప్పుడే తెలుగులో హిట్ లు తెచ్చుకుంటూ దూసుకుపోతున్న ఆమె ఈ సినిమాతో తన ఇమేజ్ దెబ్బ తింటుందేమోనని భయపడుతోంది అంటున్నారు.

    నిఖిల్ అద్వాని దర్శకత్వంలో శ్రుతి హాసన్ నటించిన 'డి-డే' సినిమాలో ఆమె నటనకుగానూ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. అర్జున్ రాంపాల్, ఇర్ఫాన్ ఖాన్ , హ్యుమా ఖురేషి ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. శృతిహాసన్ ఒక ముఖ్యమైన పాత్రపోషించింది. కరాచీ ప్రాంతానికి చెందిన ఒక వేశ్య పాత్రలో ఆమె కనిపించనుంది. ఈమె హీరోతో ప్రేమలో పడినతరువాత కధ ఏ విధంగా మలుపుతిరిగింది అనేది ఆసక్తికరంకానుంది. శృతి కనిపించేది కొద్దిసేపే అయినా ఆమె పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది.

    'డి-డే' గురించి శ్రుతి మాట్లాడుతూ ''కథ ప్రకారం చిత్రానికి ఏ సన్నివేశాలు అవసరమో వాటిలో కనిపించాను. నా పాత్ర సవాలుతో కూడుకొన్నది. అందుకే దర్శకుడు కథ వినిపించినపుడు ఎలాంటి ఆలోచన చేయకుండా నటించేందుకు అంగీకరించాను'' అని తెలిపింది. ఇందులో ఇర్ఫాన్‌ఖాన్‌, రిషి కపూర్‌, అనిల్‌ కపూర్‌, నాజర్‌, హ్యూమా ఖురేషి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌.

    English summary
    It was only recently that the Shruti moved in to her new luxury home. But that’s not the end of the story – it has a happy ending too… for the bank officials at least.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X