twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ, వెంకటేష్...ఓ తమిళ రీమేక్

    By Srikanya
    |

    హైదరాబాద్ : వెంకటేష్ సోలో హీరోగా చిత్రాలు కమిటవ్వటం తగ్గించేసారు. దృశ్యం చిత్రం తర్వాత మళ్ళీ ఆయన గోపాల గోపాల షూటింగ్ లో బిజీ అయ్యారు. ఇప్పుడు మరో చిత్రం రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అది మరేదో కాదు తమిళ హిట్ జిల్లా రీమేక్. అదే తమిళ దర్శకుడు ఆర్.టి నెల్సన్ దర్శకత్వంలో ఈ చిత్రం కొద్ది పాటి మార్పులతో తెరకెక్కే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. మోహన్ లాల్, విజయ్ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం అక్కడ ఓ మోస్తరు విజయం సాధించింది. జిల్లా చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేయకపోవటానికి కారణం రీమేక్ చేయాలనే ఆలోచనే అంటున్నారు.

    Tamil hit with Venky and Raviteja

    గత కొద్ది కాలంగా వెంకటేష్, రవితేజ కాంబినేషన్ లో వీరూపోట్ల చిత్రం ఉండే అవకాశం ఉందని వినపడుతోంది. అయితే ఇద్దరి రెమ్యునేషన్స్ కలిసి తడిసి మోపెడు అవూతూండటంతో ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ కావటం లేదని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ జిల్లా రీమేక్ కు సురేష్ బాబు సైతం ఒక నిర్మాతగా వ్యవరిస్తారని,కాబట్టి వెంకీ రెమ్యునేషన్ మొదటే తీసుకోడు కాబట్టి బడ్జెట్ కంట్రోలులో ఉంటుందని భావిస్తున్నారు.

    జిల్లాలో శివన్ అనే పాత్రను మోహన్ లాల్ పోషించారు. కథ ప్రకారం శివన్ ...మధురై ఏరియాలో ఓ డాన్. తన డ్రైవర్ ఓ పోలీస్ అధికారి చేతిలో చనిపోవటంతో అతను కుమారుడు శక్తి(విజయ్)ని పెంచుతాడు. శక్తి చిన్నప్పటి నుంచి పోలీసులను ద్వేషిస్తూ ఎదుగుతాడు. అయితే పెంచిన తండ్రి క్రైమ్ సిండికేట్ ని కాపాడటానికి శక్తి పోలీస్ గా జాయిన్ అవుతాడు. అక్కడ నుంచి కథ టర్న్ తీసుకుంటుంది. ఓ సంఘటనకు చలించిన శక్తి... పోలీసులకు సపోర్టర్ గా మారతాడు. అంతేగాక తన పెంచిన తండ్రిని మారటానికి ప్రయత్నాలు చేస్తూంటాడు...ఆ క్రమంలో ఏం జరిగిందనేది మిగతా కథ .

    ఇక మోహన్ లాల్, విజయ్ పాత్రలు రెండూ పక్కా మాస్ పాత్రలు కావటంతో తమకి కరెక్టుగా సూట్ అవుతుందని వెంకటేష్, రవితేజ భావిస్తున్నారుట. వినాయక్ లాంటి మాస్ డైరక్టర్ టేకప్ చేస్తే ఈ యావరేజ్ కథని సూపర్ హిట్ చెయ్యగలడు అంటున్నారు. మరో ప్రక్క చిరంజీవి సైతం ఈ సబ్జెక్టు విని తన కొడుకు రామ్ చరణ్ తో చేద్దామనే ఆలోచనలో ఉన్నట్లుగా ఆ మధ్యన చెప్పుకుంటున్నారు. అయితే అది మెటీరియలైజ్ కాలేదు.

    English summary
    Tamil super hit film ‘Jilla’ is all set to be re-made in Tollywood soon. As per our sources Victory Venkatesh and Raviteja is going to join hands for this film and they would reprise the roles played by Mohanlal and Vijay in the Telugu version.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X