twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాత్రి మీటింగ్ లో ప్రకాష్‌రాజ్‌ తీరుపై విచారణ చేసారు

    By Srikanya
    |

    హైదరాబాద్ :నటుడు ప్రకాష్‌రాజ్‌పై వివాదం ఓ కొలిక్కి వస్తోంది. ఆయనపై చర్యకి రంగం సిద్ధమవుతోంది. 'ఆగడు' సెట్‌లో ఒక సహాయ దర్శకుడి పట్ల అనుచితంగా ప్రవర్తించారన్న కారణంతో ఆయనపై చర్య తీసుకోబోతున్నట్టు తెలిసింది. సెట్‌లో తనతో అకారణంగా దుర్భాషలాడారని ఒక సహాయ దర్శకుడు ప్రకాష్‌రాజ్‌పై ఇటీవలే తెలుగు దర్శకుల సంఘానికి ఫిర్యాదు చేశాడు. దీంతో దర్శకుల సంఘం బుధవారం రాత్రి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

    ఈ సమావేశంలో ప్రకాష్‌రాజ్‌ తీరుపై విచారణ చేపట్టింది. సభ్యుల అభిప్రాయాల్ని సేకరించింది. మే 1న జరగబోయే సర్వసభ్య సమావేశంలో ప్రకాష్‌రాజ్‌పై ఎలాంటి చర్య తీసుకోవాలో నిర్ణయించనున్నట్టు తెలుస్తోంది. మహేష్‌ హీరోగా నటిస్తున్న 'ఆగడు'లో ప్రకాష్‌రాజ్‌ ఓ ముఖ్యభూమిక కోసం ఎంపిక చేశారు. అయితే ఈ సంఘటన నేపథ్యంలో ప్రకాష్‌రాజ్‌ స్థానంలో సోనూసూద్‌ని ఎంపిక చేసుకున్నారని సమాచారం.

    ఆగడు చిత్రానికి చెందిన కో డైరక్టర్...ఇచ్చిన కంప్లైంట్ తో ఈ వివాదం బయిటకు సమాచారం. ప్రకాష్ రాజ్ కి ఆ కో డైరక్టర్ ...గుడ్ మార్నింగ్ చెప్పి విష్ చేస్తే ఆయన నోటికి వచ్చినట్లు మాట్లాడారని అదే ఈ సమస్యను పెద్దది అయినట్లు తెలుస్తోంది.

    సినీ పరిశ్రమలో ఇప్పుడు అంతటా వినిపిస్తున్నది ప్రకాష్ రాజ్-ఆగడు టీమ్ కు జరిగిన వివాదమే. ఈ వివాదం మొదట్లో గుట్టు చప్పుడు కాకుండా ముగిసిపోతుందని అంతా భావించారు. అయితే ఈ మ్యాటర్ డైరక్టర్స్ అశోశియేషన్ సీరియస్ గా తీసుకోవటంతో అనుకున్నంత ఈజీగా ముగిసేటట్లు లేదని సమాచారం. బ్యాన్ పెడతారని తెలుస్తోంది.

    TFDA decides to ban Prakash Raj

    మరో ప్రక్క ప్రకాష్ రాజ్ ని తీసేసి ఆ ప్లేస్ లో సోనూ సూద్ ని తీసుకుని ఆగడు టీమ్ షూటింగ్ మొదలెట్టింది. అంతేకాకుండా 75 లక్షలు వరకూ ప్రకాష్ రాజ్ నుంచి వసూలు చేయాలని అడుగుతున్నట్లు సమాచారం. ప్రకాష్ రాజ్ ఇంతకు ముందులా కేవలం నటుడుగానే ఉండకుండా దర్శకుడు అవతారం ఎత్తి ఉలవచారు బిర్యాని అనే చిత్రం చేస్తున్నారు. దాంతో ఆయన ఆ బిజీలో ఉంటూ తను ఇతర సినిమాలకు ఇచ్చిన డేట్స్ కు సరిగా హాజరు కావటం లేదు. అదే పద్దతిలో ఆగడు టీమ్ కూడా ఇబ్బంది పడిందని సమాచారం.

    షూటింగ్ స్పాట్ కు ప్రకాష్ రాజ్ ఎప్పుడూ లేటేనని, వచ్చి అసెస్టెంట్ డైరక్టర్స్ పై అరవటం వంటివి చేయటం జరిగేదని చెప్తున్నారు. అయితే ఓ రోజు కో డైరక్టర్ ని విపరీతంగా తిట్టాడని దాంతో అతనే దర్శకుల సంఘంలో కంప్లైట్ చేసాడని సమాచారం. ప్రకాష్ రాజ్ విచిత్రమైన ప్రవర్తనతో విసిగినా షూటింగ్ కి ఇబ్బంది కలగకూడదని భావించిన శ్రీను వైట్ల ఆయనకు సర్ది చెప్దామని చాలా ప్రయత్నించాడు. అయితే తను ఇక షూటింగ్ రానని తెగేసి చెప్పి వెళ్ళిపోయారు.

    దూకుడులో విలన్ గా చేసిన సోనూసూద్...ని వెంటనే రప్పించి ఆ సీన్స్ అతనిపై షూట్ చేయటం శ్రీను వైట్ల మొదలెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ప్రకాష్ రాజ్ షాక్ అయ్యాడట. ఈ వివాదంలో మొదటి నుంచీ దూరంగా ఉంటూ వచ్చిన వారు మహేష్ బాబు అంటున్నారు. ప్రకాష్ రాజ్ తో గతంలో అనేక చిత్రాలు చేసిన మహేష్ బాబు ఈ విషయంలో వ్యూహాత్మకంగానే మౌనంగా ఉండి,ఎవరికీ సపోర్టు చేయలేదని అంటున్నారు.

    ప్రకాష్ రాజ్ కి తెలుగు పరిశ్రమలో సన్నిహితుడు ఎవరూ అంటే దిల్ రాజు. ఆయన సినిమాల్లో తప్పనిసరిగా ఉండే ప్రకాష్ రాజ్ అంటే దిల్ రాజు కు మంచి అభిమానం. దాంతో తన తరుపు మనిషిగా దిల్ రాజుని ఈ వివాదం పరిష్కరించమని పంపాడని సమాచారం. ఆగడు చిత్రం నిర్మాతల నుంచి ప్రకాష్ రాజ్ తీసుకున్న 75 లక్షలు తిరిగి చెల్లించి, లక్ష రూపాయలు ఫైన్ గా కట్టాలని దర్శకుల మండలి తీర్మానించినట్లు సమాచారం.

    English summary
    This revolution against Prakash Raj is going to be big as the Directors Association and Maa Association are lined up for a meeting to take an action against him for his unethical and troublesome behaviours.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X