twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకీ 'దృశ్యమ్‌' రీమేక్ కి ఘోస్ట్ డైరక్షన్

    By Srikanya
    |

    Who is directing Venkatesh's Drushyam Remake?
    హైదరాబాద్ : సినీ పరిశ్రమలో ఘోస్ట్ లు, డూపులు కామనే. చాలా సినిమాలకు తమ ప్రతిభతో ఘోస్ట్ రైటర్స్ పనిచేస్తూ పేరున్న రచయితలకు, డూపులు ప్రాణాలకు తెగించి హీరోలకు... లైఫ్ ఇస్తూంటారు. అయితే కొన్ని సినిమాలకు డైరక్టర్ వీక్ అయినప్పుడు హీరోనే ఘోస్ట్ డైరక్షన్ అవతారం ఎత్తి తన సరదా తీర్చుకుంటూంటారు. ఇప్పుడు అలాంటిదే వెంకటేష్‌ 'దృశ్యమ్‌' రీమేక్ కి జరుగుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినపడుతున్నాయి. ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఎస్. గోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని ఘోస్ట్ డైరక్ట్ చేస్తున్నారని వినికిడి.

    దర్శకురాలిని ప్రక్కన పెట్టి ఈ ఘోస్ట్ డైరక్షన్ సాగుతోందని, దానికి సురేష్ బాబు మద్దతు ఉందని చెప్పుకుంటున్నారు. ఎస్ గోపాల్ రెడ్డి గతంలో నా ఆటోగ్రాఫ్ చిత్రాన్ని రవితేజతో రీమేక్ చేసి దర్శకుడుగా లాంచ్ అయ్యారు. అయితే చిత్రం విజయవంతం కాకపోవటంతో ఆయన కెమెరామెన్ గానే కంటిన్యూ అయ్యారు.

    ఇక ఈ చిత్రానికి శ్రీప్రియ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే శ్రీప్రియ రీసెంట్ గా మరో మళయాళ చిత్రం 22 ఫిమేల్ కొట్టాయిం)ని మాలిని 22 గా రీమేక్ చేసి తమిళంలో రిలీజ్ చేసారు. ఆ చిత్రం డిజాస్టర్ అయ్యింది. దాంతో తెలుగు వెర్షన్ రిలీజ్ ఆగిపోయింది. ఈ నేపధ్యంలో 'దృశ్యమ్‌'కూడా మళయాళ చిత్రం కావటం, దీన్ని రీమేక్ చేస్తోంది శ్రీప్రియ కావటంతో కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

    నిర్మాత మాట్లాడుతూ...''గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు.. వాటి వల్ల ఆయా కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందుల్ని కళ్లకు కట్టేలా దర్శకురాలు తీర్చిదిద్దుతున్నారు. అనేక సమకాలీన అంశాల్ని చిత్రంలో పొందుపరుస్తున్నారు. తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధాన్ని చూపే సన్నివేశాల్ని దర్శకురాలు చక్కగా తెరకెక్కిస్తున్నారు'' అంటున్నారు.

    మీనా హీరోయిన్ గా చేసే ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్‌ థియేటర్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌, వైడ్‌ యాంగిల్‌ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాజ్‌కుమార్‌ సేతుపతి నిర్మాత. డి.సురేష్‌బాబు సమర్పకులు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కేరళలోని అందమైన లొకేషన్స్‌లో జరుగుతోంది. చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రంలో నదియా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. త్వరలో సినిమా పేరుని ప్రకటిస్తారు.

    వెంకటేష్ మాట్లాడుతూ.... ఇక్కడ ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకోలేం. ఎంతసేపూ సురక్షితంగానే ప్రయాణం చేయాలి. ఆ పంథాలో ఆలోచించినప్పుడే రీమేక్‌ సినిమాలు తెరకెక్కుతుంటాయి. అయినా రీమేక్‌ చేయడం తప్పేం కాదు. మంచి సినిమా అనుకొన్నప్పుడు... దాన్ని మన ప్రేక్షకులకు కూడా అందేలా చేయాలి. అలా చేసిన ప్రతీసారీ నాకు విజయం దక్కింది. నేనే కాదు... హీరోల్లో చాలామంది రీమేక్‌ సినిమాలు చేశారు.

    కాకపోతే వాటిలో నాకు ఎక్కువ విజయాలున్నాయి. ఇటీవల పొరుగు భాషల్లోని హీరోలు సైతం రీమేక్‌ సినిమాలపై దృష్టి కేంద్రీకరించారు. హిందీలో సల్మాన్‌ఖాన్‌ మన తెలుగు కథలతో విజయాలు అందుకొంటున్నాడు. కథలు వినిపించడానికి చాలామంది వస్తుంటారు. అయితే... ఆ కథలు ప్రేక్షకులకి ఎలా చేరతాయనే విషయం గురించి ఆలోచించాలి. అప్పుడే సరైన ఫలితాలొస్తాయి అన్నారు.

    English summary
    Sripriya is officially wielding the megaphone, but reportedly seasoned cinematographer S Gopal Reddy (who also directed Naa Autograph) is ghost directing and calling the shots on the sets for important scenes pertaining to leading star Venkatesh in the Malayalam remake.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X