twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గోవిందుడు అందరివాడేలే' టీజర్‌ పై కొత్త డౌట్

    By Srikanya
    |

    హైదరాబాద్‌: రామ్‌చరణ్‌,క్రియేటివ్‌ దర్శకుడు కృష్ణవంశీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'. కృష్ణవంశీ మార్కుకు తగ్గట్టుగానే భారీ తారాగణంతో ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్‌ ఇటీవల విడుదల చేసింది. ఈ టీజర్ లో రామ్ చరణ్ తండ్రి పాత్రలో కనిపించే రహమాన్ కనిపించకపోవటం ఇప్పుడు మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో ఆయనదీ కీలకమైన పాత్రే అని చెప్తున్నారు కాబట్టి రహమాన్ కూడా కనిపిస్తాడని ఆశించారు. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌. పరమేశ్వర ఆర్ట్స్‌ పతాకంపై బండ్ల గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కు తాతగా ప్రకాష్‌రాజ్‌ నటిస్తున్నారు.

    తాత(ప్రకాష్ రాజ్),బాబయ్య(శ్రీకాంత్) తో ఉన్న విజువల్స్ తోనే టీజర్ టీజర్ కట్ చేసారు. అలాగే విడుదల చేసిన ఫొటోల్లోనూ ఆయన లేరు. అయితే కొందరు అనేది ఏమిటంటే...ఈ టీజర్ దాదాపు నెల క్రితమే రెడీ అయ్యిందని, అప్పటికి రహమాన్ ఇంకా ఈ చిత్రం షూటింగ్ కు రాలేదని అంటున్నారు. మరికొందరు..అలాంటిదేం లేదు..రహమాన్ ని మార్చే ఆలోచన కృష్ణ వంశీకి ఉండి ఉంటుంది అందుకే ఆ పాత్రను రివిల్ చేయలేదు. అయితే ఏది ఎలా ఉన్నా ఈ పాత్ర కనిపించకున్నా టీజర్ మాత్రం చాలా కలర్ ఫుల్ గా ఉండి కృష్ణవంశీ, రామ్ చరణ్ అభిమానులను సంతృప్తి పరిచింది.

    Why HE Missed from GAV trailer?

    రామ్‌చరణ్‌ మాట్లాడుతూ... 'ఆరెంజ్‌' తర్వాత ప్రేమకథ నేపథ్యంలో సినిమా చేయలేదు. చేస్తే కృష్ణవంశీతోనే చేయాలనుకున్నాను. ఈలోగా చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఏదీ ఒప్పుకోలేదు. ఈ సినిమా నేను చేయకపోతే కుటుంబ ప్రేక్షకులకు దూరమయ్యేవాడిని. తెలుగు సినిమా ఆస్తి కృష్ణవంశీ. ప్రకాష్‌రాజ్‌, జయసుధ సినిమాలోకి వచ్చాకే పరిపూర్ణత వచ్చింది. ఏటీఎం పాత్ర చూసినప్పటి నుంచి శ్రీకాంత్‌గారి ఫ్యాన్‌ని. ఆయన నాకు మరో బాబాయి. పరుచూరి సోదరులను ఇక నుంచి స్క్రిప్టు డాక్టర్స్‌ అనాలి. ప్రతి దర్శకుడు వాళ్ల దగ్గర శిక్షణ తీసుకోవాల్సిందే. మేమంతా కలసి మంచి సినిమా తీశాం. అభిమానులందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది'' అన్నారు.

    కృష్ణవంశీ మాట్లాడుతూ '' ఒకసారి చరణ్‌ మేనేజర్‌ను కలసి చరణ్‌తో పది నిమిషాలు మాట్లాడాలని అడిగాను. వెంటనే చరణ్‌ పిలిపించాడు. నేను వెళ్లగానే అతను నాపై చూపించిన గౌరవం చూసి నేనింకా చచ్చిపోలేదు అనిపించింది. 20 నిమిషాలు నా ఆలోచనలను చరణ్‌కు చెప్పాను. వెంటనే మనం సినిమా చేద్దాం అన్నాడు. అన్నయ్య కూడా అలాగే ప్రోత్సహించారు. వెయ్యేనుగుల బలం అంటే ఏమిటో అప్పుడే తెలిసింది. ప్రపంచంలో చాలా అరుదుగా కనిపించే లక్షణం సంస్కారం. దాన్ని చరణ్‌లో చూశాను. అన్నయ్యే అలా తయారు చేశాడు. ఓ చక్కనైన, చిక్కనైన, అందమైన తెలుగు సినిమా ఇది. కనీసం 50 ఏళ్లపాటు దీని గురించి చెప్పుకుంటారు. ఇది అతివిశ్వాసంతో చెపుతున్న మాట కాదు. ఆత్మవిశ్వాసంతో చెప్తున్న మాట'' అన్నారు.

    ప్రకాష్‌రాజ్‌ మాట్లాడుతూ ''ఆహ్లాదకరమైన ప్రచార చిత్రాన్ని చూశాను. ఈ మధ్య కొన్ని కారణాల వల్ల నేను కృష్ణవంశీ సినిమాలకు దూరమయ్యాను. ఇప్పుడు నా అదృష్టం కొద్ది కృష్ణవంశీనే నన్ను పిలిచి ఈ పాత్ర ఇచ్చాడు'' అన్నారు. దసరాకు (అక్టోబర్‌1)న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని నిర్మాత చెప్పారు.

    English summary
    Everything is fine but one person is missing in the Govindudu Andarivadele teaser is and he is none other than father character of Charan. Yesteryear actor Rahman is roped in for the crucial role but he was not appeared in the trailer anywhere.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X