జెన్నిఫర్ అనిస్టాన్ కు భర్తల గొడవ

శుక్రవారం, అక్టోబర్ 9, 2009, 12:49 [IST]
Jennifer Aniston
హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్, తన మాజీ భార్య జెన్నిఫర్ అనిస్టాన్ న్యూయార్క్ లోని ఓ హోటల్ లో రహస్యంగా సమావేశమయ్యారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో వారు బ్రాడ్ తాజా సహచరిణి ఏంజలీనా జోలీ గురించి చర్చించారని వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలన్నీ కేవలం కల్పితాలేనని అనిస్టాన్ కు సంబంధించిన ఓ వ్యక్తి చెప్పాడని యు.యస్ వీక్లీ ప్రచురించింది. అలాగే పిట్, జోలీ జంట మధ్య వున్న అనుబంధం చాలా దృఢంగా వుందని కూడా ఈ పత్రిక పేర్కొంది.

ఇదిలా వుంటే అనిస్టాన్ మరో భర్త మ్యుజీషియన్ జాన్ మేయర్ అనిస్టాన్ ను తిరిగి తన జీవితం లోకి ఆహ్వానించాలనుకుంటున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. జాన్ అనిస్టాన్ కు ఈ-మెయిల్స్, ఫోన్ కాల్స్ తో తిరిగి తనతో జీవించాలని అడుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ 31 ఏళ్ల మ్యుజీషియన్, 40 ఏళ్ల అనిస్టాన్ ను తిరిగి తనతో వుండమని బ్రతిమలాడుతున్నట్టు వస్తోన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని జాన్ మేయర్ శ్రేయోభిలాషులు చెబుతున్నారు.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST