ప్రమాదానికి గురయిన అమ్మాయిల కలల రాకుమారుడు!!

శుక్రవారం, అక్టోబర్ 30, 2009, 17:16 [IST]
హాలీవుడ్ నటుడు, అమ్మాయిల కలల రాకుమారుడు, 'ట్రాయ్' చిత్ర హీరో బ్రాడ్ పిట్ ఇటీవల ఓ చిన్నపాటి ప్రమాదానికి గురయ్యారు. లాస్ ఏంజిల్స్ లో ఈ సంగటన చోటు చేసుకొంది. TMZ.com కథనం ప్రకారం ఇటీవల లాస్ ఏందజిల్స్ నగరంలో బైకు నడుపుతున్న ఈ హీరో గారు కార్ల మధ్యలో వీలింగ్ చెయ్యడానికి ప్రయత్నించడంతో, బైకు మీద అదుపు కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకొంది. కానీ అదృష్టావశాత్తు మన హీరో గారు చిన్న పాటి గాయాలతో ఈ పమాదం నుండీ బయటపడ్డారు.

ప్రమాదం జరిగిన వెంటనే తేరుకున్న బ్రాడ్ మోటర్ బైకును రోడ్డు ప్రక్కన వదిలేసి, ప్రక్కనే వున్న అపార్ట్ మెంట్ లోకి పరుగుతీసాడట. ప్రమాదం జరిగినప్పుడు ఈ ఆరుగురు పిల్లల తండ్రి హెల్మెట్ ధరించి వుండటంతో ప్రమాదం నుండీ రక్షణ పొందడమే కాకుండా అక్కడ వున్న వారు ఆయన్ను గుర్తుపట్టకుండా వుండేందుకు సాయపడిందట. దీనిపై W-మ్యాగ్జయిన్ అడిగిన ప్రశ్నకు అదేమీ పెద్ద విషయం కాదని, కానీ హెల్మెట్ వుండటం ద్వారా చుట్టుపక్కల వారు నన్ను గుర్తించకుండా వుండేందుకు సాయపడిందని బ్రాడ్ చెప్పుకొచ్చాడు. అయినా సెలబ్రిటీలు తుమ్మినా, దగ్గినా అదొక వార్తే!! అలాంటిది యాక్సిడెంట్ కు గురయితే మీడియా వదులుతుందా....మీకిది పెద్ద విషయం కాకపోవచ్చు బ్రాడ్ అన్నాడట సదురు విలేఖరి...సత్యం భోధించావు పార్థా...!!.!
User Comments
సామాన్యుడు 31 Oct 2009 10:29 am
తప్పు బాబు, ప్రస్తుత కాలం లో ఈ మీడియా లో మేమే ఎటువంటి వార్తనైనా మొదట ప్రచారం చేయగలిగేమన్న దుగ్ద తప్ప అది ఎ రకంగా నిజంగా ఎవ్వరికైనా పనికి వస్తుందా? అన్నదీ లేదు, మాకిచ్చిన పని వార్తా సేకరణ, దానిలో ఎంత నిజం అన్నది వార్తలోని బాదితులే కే తెలియాలి,ప్రస్తుతం మీడియా పైశాచిక ఆనందం లో ఉంది...
[ మీ వ్యాఖ్య రాయండి ]
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST