సంచలనం కోసమే అంత పని చేసారట!!

శుక్రవారం, అక్టోబర్ 30, 2009, 13:56 [IST]
వివాదాస్పద రచయిత ఆండ్రివ్ మోర్టాన్ తాజాగా హాలీవుడ్ తార ఏంజలీనా జోలీ బయోగ్రఫీని ఓ పుస్తకంగా రాసిన సంగతి తెలిసిందే. ఇంకా విడుదల కాని ఈ పుస్తకంలో జోలీ తన పదహారవ ఏటన తన తల్లి ప్రియుడితో పడుకుందనే విషయం ప్రస్తావించినట్టు వచ్చిన వార్త సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కానీ ఈ విషయాన్ని ఆండ్రివ్ ఖండిస్తున్నాడు. అలాంటి సంగతేదీ తన పుస్తకంలో చోటుచేసుకోలేదని స్పష్టం చేసాడు. ఇంతకు మునుపు ప్రిన్స్ స్ డయానా, టామ్ క్రూజ్ ల గురించి పుస్తకాలు రాసిన ఈ బ్రిటీష్ రచయిత తాజాగా ఏంజలీనాను ఎన్నుకున్నప్పటి నుండీ ఈ పుస్తకం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ తాజా వచ్చిన ఈ వార్త ఓ పెను సంచలనం సృష్టించింది. దీంతో ఈ విషయమై 'లైఫ్ స్టైల్ మ్యాగ్జయిన్' కు ఇచ్చిన ఇంటర్యూలో ఆండ్రివ్ సదురు వార్తలని ఖండించాడు.

కాగా ఈ పుస్తకంలో తాను ఏ అంశాలను ప్రస్తావించనో చెప్పడానికి ఆండ్రివ్ నిరాకరించాడు. కానీ ఏంజలీనా, బ్రాడ్ పిట్ ల అనుభందం గురించి ప్రస్తావించినట్టు విశ్వసనీయ సమాచారం. అసలీ పుస్తకంలో ఏముందో తెలుసుకోవాలంటే డిసెంబరు 1వ తారీఖు వరకూ ఆగాల్సిందే. ఎందుకంటే అదే రోజున పుస్తకం విడుదల కానుంది. కానీ ఇదంతా పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST