అనుమానాస్పదంగా మృతి చెందిన 'బాయ్ జోన్' బ్యాండ్ సింగర్ స్టిఫెన్ గ్యాట్లీ తన మరణానికి ముందు రాసిన వీలునామా ఆచూకీ కనిపించడం లేదట. దీనిపై స్టిఫేన్ భర్త ఆండ్రీ క్లౌస్ స్పందిస్తూ స్టిఫెన్ కు సంబంధించిన 7.2 మిలియన్ పౌండ్ల ఆస్తి లండన్ కు చెందిన ఓ కంపెనీలో వున్నాయని, కానీ ఆ కంపెనీ వివరాలేవీ తనకు తెలియవని, సదురు కంపెనీ కూడా సంప్రదించకుండా మౌనం వహించడం బాధాకరని తెలిపారు.
దీనిపై ఆండ్రీ సంబంధీకులు మాట్లాడుతూ అసలు వీలునామా ఎక్కడ వుందో తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని, అసలు ఏ కంపెనీలో ఆస్తులు వున్నాయో తెలియకపోవడం దురదృష్టకరం అనీ, సదురు కంపెనీ స్టిఫెన్ మరణించి నెల కావస్తున్నా ఎందుకు ఇంకా వారి కుటుంబ సభ్యులను సంప్రదించలేదో తెలియడం లేదని ఆదోళన వ్యక్తం చేసారు. తన సహచరున్ని పోగొట్టుకొని అమితమైన బాధలో వున్న ఆండ్రీని ఈ పరిణామాలు మరింత కృంగదీస్తున్నాయట.