To check Oneindia Telugu on your Mobile
go to:   http://m.oneindia.in/telugu/

'ఇంద్ర ధనస్సు' కల సాకారమయింది

ఇంద్రధనస్సులో ఏడు రంగులు లాగా తన కుటుంబంలో ఈ ఏడు మంది పిల్లలు వుండాలని ఆమె ఆశపడింది. ఏడు రంగులూ వేటికవే భిన్నంగా వున్నట్టు తన పిల్లలు కూడా ఒకరిలా మరొకరు వుండకూడదనుకొంది. అనుకోవడంమే కాదు అందుకోసం ఎన్నో దేశాలు తిరిగింది. ఎంతో మంది అనాధలను కలిసింది. వారి బాగోగులకై ఆ దేశ ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను ఆరా తీసింది. అంతే కాకుండా తన వంతు సాయం చేసింది. ఒక్కో దేశం నుండీ ఓ అనాధను దత్తతకు తీసుకొంది. ఇంతా చదివాకా ఆమె మరెవరో కాదు హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజలీనా జోలీ అని మీకు ఈ పాటికే అర్థమయివుంటుంది.

ఈ 34 ఏళ్ల నటి సరిగ్గా నాలుగేళ్ల క్రితం తన కుటుంబంలో ఇంద్రధనుస్సులో రంగుల్లాగా ఏడుగురు పిల్లలు వుండాలని, వారు భిన్నమైన మతాల వారై, భిన్న సాంప్రదాయాలకు చెందిన వారై వుండాలని చెప్పింది. ఇటీవలే ఏంజలీనా, బ్రాడ్ జంట సిరియా నుండీ ఓ బిడ్డను దత్తతకు తీసుకున్నారు. ఆ బిడ్డ అమ్మాయో లేక అబ్బాయో చెప్పడానికి వారు నిరాకరిస్తున్నారు. దీంతో ఏడుగురు పిల్లలు కావాలనుకున్న ఏంజలీనా కల నిజమయింది. ఏంజలీనా, బ్రాడ్ లకు ముగ్గురు పిల్లలు కాగా, ముగ్గురు అనాధలను వారు దత్తతకు తీసుకున్నారు. వారు కంబోడియా, ఇథియోపియా, వియాత్నాం దేశాలకు చెందిన వారు.
నవంబర్ 3, 2009  లో ప్రచురితమైన అన్ని ఆర్టికల్స్ చదవండి
 
ODI, Adelaide Oval
India won by 4 wickets

ఏంజిలీనా జోలీని అధిగమించి ఉత్తమ తల్లిగా నిలిచిన బ్రిట్నీ స్పియర్

క్రిస్మస్ సేవింగ్స్ కంపెనీ పార్క్ నిర్వహించిన సర్వేలో పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్ ఉత్తమ తల్లిగా నిలిచిందని ది మిర్రర్ పత్రిక వెల్లడించింది. ఏడు వేల మంది అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ జాబితాని విడుదల చేసారుట. ఎన్నో వివాదాల్లో చిక్కుకొని ఎప్పుడూ ఏదో ఓ వార్తతో లైమ్ లైట్ లోవుండే ఈ పాప్ సింగర్ ఇప్పుడీ.....

జెన్నిఫర్ అనిస్టాన్ కు భర్తల గొడవ

హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్, తన మాజీ భార్య జెన్నిఫర్ అనిస్టాన్ న్యూయార్క్ లోని ఓ హోటల్ లో రహస్యంగా సమావేశమయ్యారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో వారు బ్రాడ్ తాజా సహచరిణి ఏంజలీనా జోలీ గురించి చర్చించారని వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలన్నీ కేవలం కల్పితాలేనని అనిస్టాన్ కు సంబంధించిన ఓ.....
User Comments
ప్రవీణ్ తల్వేద 03 Nov 2009 03:27 pm
ప్రవీణ్ తల్వేద
[ మీ వ్యాఖ్య రాయండి ]
Oneindia  Oneindia Login