స్నేహం కోసం ఆ నలుగురూ...!!

సోమవారం, నవంబర్ 2, 2009, 18:42 [IST]
ఐరిస్ మ్యూజిక్ బ్యాండ్ 'బాయ్ జోన్' సభ్యుడు స్టిఫెన్ గ్యాట్లీ అక్టోబర్ 10వ తేదీన అనుమానాస్పద రీతిలో మరణించిన విషయం తెలిసిందే. కాగా తమ మిత్రుని మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు బాయ్ జోన్ మిగితా సభ్యులు. ఇటీవల వారు మీడియా తో "బాయ్ జోన్ నుండీ రాబోయే ఆల్బమ్ కోసం ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తయింది, దివంగత స్టిఫెన్ తన మరణానికి ముందు రెండు పాటలను రికార్డు చేసాడు, అవి ఆల్బమ్ కు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. ఈ ఆల్బమ్ కోసం స్టిఫెన్ ఎంతో కష్టపడ్డాడు, పాటలు బాగా రావాలని ఎంతో ఆరాటపడేవాడు..!! ఆ పట్టుదల, శ్రమ ప్రతీ పాటలోనూ కనిపిస్తుంది" అని చెప్పారు.

త్వరలోనే ఆల్బమ్ విడుదల కానుందని, ఈ ఆల్బమ్ ను తమ మిత్రుడు స్టిఫెన్ కు అంకితం చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా బ్యాండ్ లో ని సభ్యులందరూ తమ మిత్రుడితో కలసి గడిపిన రోజులను నెమరువేసుకున్నారు. తమ మిత్రుడు ఎక్కడ వున్నా తమ వైపు చూస్తుంటాడని, ఈ విషయాలు విని ఆనందిస్తుంటాడని ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. కాగా మైఖేల్ జాక్సన్ మరణానంతరం వచ్చిన "దిస్ ఈజ్ ఇట్" డాక్యుమెంటరీ రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. మరిది ఏ మేరకు ఆర్జిస్తుందో చూడాలి.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST