ప్రపంచమంతటా మార్చి 2న విడుదల...!

ఆదివారం, ఫిబ్రవరి 12, 2012, 15:04 [IST]
Hollywood
ప్రపంచ వ్యాప్తంగా యాక్షన్ హీరోలలో తనకంటూ డిఫరెంట్ ఇమేజిని సంపాదించుకున్న హాలీవుడ్ కధానాయకుడు జెట్‌లీ నటించిన 'ఏ వైట్ స్నేక్ రివేంజ్' చిత్రాన్ని మగధీరుడుగా తెలుగు ప్రేక్షకులకు అందించి విజయాన్ని సాధించిన సుప్రసిధ్ద నిర్మాత కోరుకొండ వరహాలరావు ఇప్పడు మరో హాలీవుడ్ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు.

ప్రపంచమంతటా మార్చి 2న విడుదల! మన తెలుగులోకి అనేక అనువాద చిత్రాల్ని అందించిన సత్యా ప్రొడక్షన్స్ అధినేత కోరుకొండ వరహాలరావు మాట్లాడుతూ ఈ మద్యనే మేము అందించిన మగధీరుడు అన్ని కేంద్రాల్లో విజయాన్ని పొందింది. ఇప్పుడు హాలీవుడ్‌లో రూపుదిద్దుకున్న మరో ఆంగ్ల చిత్రమైన 'జబ్బర్ వాక్' యూనివర్సల్ మూవీస్ సమర్పణలో తెలుగులోకి 'జురాసిక్ ద్వీపం' పేరిట అనువదించడింది. ఇదోక యాక్షన్‌తో కూడుకున్న అడ్వంచర్ ఫాంటసీ కధా చిత్రం.

గతంలో మనకు వచ్చిన సూపర్ డూపర్ హిట్ చిత్రం 'జురాసిక్ పార్క్' ఎంతటి స్దాయిలో ప్రేక్షకుల్ని అలరించి, విజయాన్ని పొందిందో ఇప్పుడీ జురాసిక్ ద్వీపం కూడా అంతే హిట్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. ఇక ఈ సినిమా కధ విషయానికి వస్తే హాలీవుడ్లో ఓ మారుమూల అడవి ప్రాంతంలో ఓ పక్షి ఉంటుంది. ఆకా శ మంత స్దాయిలో ఉన్న జబ్బర్ వాక్ అనే ఈ పక్షి మానవుల్ని సంహారిస్తూ అరాచకం సృష్టిస్తూ ఉంటుంది.

దీని బారి నుండి ప్రజల్ని తమతోటి వారిని రక్షించుకునేందుకు గాను నలుగురు వీరులు ఎన్నో ఆలోచల్ని వేసి ఓ ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ ప్రకారం జబ్బర్ వాక్ పక్షిని ఏ విధంగా అంతం చేస్తారనే ఈ చిత్రం. ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీషు, హిందీ, తమిళం, తెలుగులో ఈ చిత్రాన్ని మార్చి 2వ తారీఖున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరోలు తహీమో పెనికిట్, ఫ్రాన్సిస్ మైఖెల్, అలెక్ కాసీ చార్న్ ఫీల్డ్, అన్ చెల్ హ్రిస్టోమి, స్టిఫెన్ జెన్‌రెస్ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషించారు.
English summary
Steven R. Monroe (I Spit on Your Grave) directs the flick starring Tahmoh Penikett ("Dollhouse"), Kacey Barnfield (Resident Evil: Afterlife), Michael Worth (God's Ears), Richard Riddell (The Imaginarium of Doctor Parnassus), and Ian Virgo (The Raven").
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST