twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కామన్‌వెల్త్ గేమ్స్‌లో సినిమా స్టార్ హీరో...పరువు తీసాడు!

    By Bojja Kumar
    |

    లండన్: హాటీవుడ్ హిట్ చిత్రాలైన ట్రాన్స్‌పోర్టర్, ది ఎక్స్‌స్పెండబుల్స్ లాంటి హాలీవుడ్ సిరీస్ హిట్ చిత్రాలు చూసిన వారికి నటుడు జాసన్ స్టాటుమ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. సినిమాల్లో యాక్షన్ సీన్లు, రొమాంటిక్ సీన్లు అదరగొట్టే హీరోకు హాలీవుడ్లో మంచి పేరుంది. బట్టతల ఉన్నా హాట్‌ అండ్ స్టైలిష్ లుక్‌‍తో అమ్మాయిలను పడేయటం అతని ప్రత్యేకత.

    తాజాగా జాసన్ స్టాటుమ్ గురించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. గతంలో ఈ హీరో ఇంగ్లండ్ దేశం తరుపున కామన్ వెల్త్‌గేమ్స్‌లో పాల్గొన్నాడు. 1990లో న్యూజిలాండ్‌లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్‌లో జాసన్ స్టాటుమ్ డైవింగ్(పల్టీలు కొడుతూ ఈత కొలనులో దూకడం) విభాగంలో పాల్గొన్నాడు.

    Jason Statham: Actor, hero, Commonwealth Games diver

    అయితే అప్పటి పోటీల్లో డైవింగ్ విభాగంలో అందరికంటే తక్కువ స్కోరు చేసింది జాసమ్ స్టాటుమే. తాజాగా స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో 20వ కామన్‌వెల్త్ గేమ్స్ జరుగుతున్న నేపథ్యంలో.....బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కామర్పొరేషన్(బిబిసి) ఈ హాలీవుడ్ హీరోగారి గురించిన వివరాలు వెలుగులోకి తెచ్చింది.

    జాసమ్ స్టాటుమ్‌ అతి తక్కువ స్కోరు చేయడంతో అప్పట్లో ఇంగ్లండ్ అభిమానులు పరువు పోయినట్లు ఫీలయ్యారట. పాపం కామన్ వెల్త్ గేమ్స్‌లో అప్పట్లో అతనికి కలిసి రాక పోయినా....హాలీవుడ్ సినిమాల్లో మాత్రం అదిరిపోయే స్టంట్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు జాసమ్ స్టాటుమ్. అదీ సంగతి.

    English summary
    Before Jason Statham began locking, stocking, transporting, cranking, snatching, and expendableing, he was just another man trying to gain international fame as a competitive diver. Statham, he of action movie stardom, spent 12 years on England’s national diving team, and participated in the 1990 Commonwealth Games in New Zealand.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X