twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అది క్రూరత్వమే: ఐస్ బకెట్ చాలెంజ్ తిరస్కరించిన బ్యూటీ

    By Bojja Kumar
    |

    Pamela Anderson
    హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఐస్ బకెట్ చాలెంజ్ పీవర్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సినిమా సెలబ్రిటీలు, మాజీ మైక్రోసాఫ్ట్ సీఈఓ బిల్ గేట్స్, ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బెర్గ్ లాంటి ప్రముఖులు ఐస్ బకెట్ చాలెంజ్ స్వీకరిస్తూ....మరొకరికి చాలెంజ్ విసురుతూ ఈ ఐస్ బకెట్ చాలెంజ్‌కు మరింత క్రేజ్ తెచ్చారు. అమెరికాలో మొదలైన ఈ ఫీవర్ సోషల్ మీడియా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పాకింది. టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఐస్ బకెట్ చాలెంజ్‌లో పాల్గొంటున్నారంటే విషయం అర్థం చేసుకోవచ్చు.

    ఏఎల్ఎస్ క్యాన్సర్ చారిటబుల్ ట్రస్టుకు విరాళం ఇవ్వడంలో భాగంగా ఈ ఐస్ బకెట్ చాలెంజ్ జోరుగా సాగుతోంది. అయితే ఇప్పటి వరకు ఈ ఐస్ బకెట్ చాలెంజ్‌ను తిరస్కరించిన వారంటూ ఎవరూ లేరు. అయితే తొలిసారిగా ప్రముఖ హాలీవుడ్ నటి పమేలా అండర్సన్ మాత్రం ఈ ఐస్ బకెట్ చాలెను తిరస్కరించి వార్తల్లోకి ఎక్కింది. ఏఎల్ఎస్ సంస్థపై కోపంతో ఆమె ఈ ఐస్ బకెట్ చాలెంజ్ తిరస్కరించింది.

    జంతు సంరక్షణ ఉద్యమ కార్యకర్తగా ఉన్న పమేలా అండర్సన్....ఏఎసల్ఎస్ సంస్థ జంతువులపై చేస్తున్న ప్రయోగాలను వ్యతిరేకిస్తూ ఈ ఐస్ బకెట్ చాలెంజ్‌ను తోసి పుచ్చింది. మానవుల వ్యాధుల నివారణకు ప్రయోగాలు జరగాలి. కానీ అందుకు ప్రయోగాల పేరుతో జంతువులను బలి చేయకూడదు. వాటిని బలిచేయడం క్రూరత్వమే అంటూ ఫేస్ బుక్ పేజీలో వ్యాఖ్యానించింది.

    English summary
    It is the latest internet craze that has seen dozens of celebrities and sports stars have freezing cold water poured over themselves for charity. But Pamela Anderson has refused to take part in the Ice Bucket Challenge - in aid of the ALS Association, which helps sufferers of motor neurone disease (MND) - on ethical grounds.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X