twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ అబ్బాయిపై....ఆ భారీ బడ్జెట్ మూవీ డైరెక్టర్ రేప్?

    By Bojja Kumar
    |

    లాస్ ఏంజిల్స్: హాలీవుడ్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో 'ఎక్స్ మెన్' సిరీస్ సినిమాల్లు ఒకటి. త్వరలో 'ఎక్స్ మెన్' నెక్ట్స్ సిరీస్ 'డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్' చిత్రం కూడా రాబోతోంది. ఈ చిత్రానికి బ్ర్యాన్ సింగర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేస్తూ ఓ వ్యక్తి మీడియా ముందుకొచ్చారు. ఆ వ్యక్తి పేరు మైఖేల్ ఈగన్. వయసు 31.

    తాను మైనర్‌గా ఉన్నపుడు బ్ర్యాన్ సింగర్ తనను రేప్ చేసాడని..... మైఖేల్ ఈగన్ ఆరోపిస్తున్నారు. అప్పట్లో తనపై లైంగిక దాడి జరిగిన విషయమై తన తల్లి లాస్ ఏంజిల్ష్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసిందని, 1999వ సంవత్సరం చివర్లో ఈ సంఘటన చోటు చేసుకుందని మైఖేల్ ఈగన్ తెలిపారు.

    'X-Men' director Bryan Singer accused of raping minor

    ఈ మేరకు 48 ఏళ్ల బ్ర్యాన్ సింగర్‌పై హవాయిలోని కోర్టులో కేసు వేసారు. తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనకు డ్రగ్స్, ఆల్కహాల్ ఇప్పించి తనపై అసహజ సెక్సుకు పాల్పడ్డాడని, ఓరల్ సెక్సుకు పాల్పడ్డాడని అఫిడవిట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఓ వైపు 'ఎక్స్ మెన్' సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మైఖేల్ ఈగన్ ఆరోపణలు సంచలన సృష్టించాయి.

    అయితే బ్ర్యాన్ సింగర్ తరుపున లాయర్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. మైఖేల్ ఈగన్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా కల్పితమైనవని పేర్కొన్నారు. దీనిపై కోర్టులోనే తేల్చుకుంటామన్నారు. కాగా ఎక్స్ మెన్ సినిమాలను నిర్మిస్తున్న 'ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్' సంస్థ దర్శకుడిపై వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ...ఇది అతని పర్సనల్ విషయంగా పేర్కొంది.

    English summary
    A man who has sued filmmaker Bryan Singer, the director of the upcoming blockbuster action film "X-Men: Days of Future Past," for allegedly raping him as a teenager said on Thursday that his claims of sexual abuse went unheeded by authorities.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X