రవితేజకు నిజంగా ప్రాణభయం ఉందా? ఆయన పిస్టల్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోవడంతో పోలీసు ఉన్నతాధికారులకు ఇబ్బందికరమైన పరిస్ధితి ఎదురైంది. సినిమాల్లో సరదా హీరోగా పేరున్న రవితేజకు ఎవరూ శత్రువులు లేరని, ఆయన ఎందుకు పిస్టల్ లైసెన్స్ కోసం దరాఖాస్తు చేసుకున్నారో అర్ధం కావడం లేదని ఒక సీనియర్ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు.
బాలకృష్ణ ఇంట్లో కాల్పుల వాస్తవ సన్నివేశం తర్వాత సినిమా వాళ్ళకు పిస్టల్ లైసెన్సులు ఇవ్వడానికి పోలీసు శాఖ ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తోంది. రవితేజ మీద ఎటువంటి క్రిమినల్ ఆరోపణలు లేకపోయినా అతని తమ్ముడి మీద చిల్లర కేసులు ఉన్నాయి. తమ్ముడు ఆ పిస్టల్ ను దుర్వినియోగం చేస్తాడేమోనన్న ఆందోళన పోలీసు అధికారులకు ఉంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ తన లైసెన్స్ డ్ రివాల్వర్ ను స్వాధీనం చేయడం, ఆ తర్వాత తన మనుషుల పేరుతో మళ్ళీ లైసెన్సుకు దరఖాస్తు చేసుకోవడం వివాదాస్పదమైంది. బాలకృష్ణ-బెల్లంకొండ ఉదంతం పునరావృతం అవుతుందేమోనన్న అనుమానంతోనే రవితేజకు రివాల్వర్ లైసెన్స్ ను నిరాకరించినట్టు తెలుస్తోంది.