Englishবাংলাગુજરાતીहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

వేషాలు దొరక్కే ఆర్తి అగర్వాల్

Published: Friday, May 29, 2009, 9:44 [IST]
 

 వేషాలు దొరక్కే ఆర్తి అగర్వాల్
 

నువ్వు నాకు నచ్చావ్ చిత్రంతో యువత కలలరాణిగా వెలిగి, స్టార్ హీరోలతో చేసిన ఆర్తి అగర్వాల్ తాజాగా పోసాని ప్రక్కన కమిటయ్యింది. మెంటల్ కృష్ణ అనంతరం పోసానికి ప్రక్కన చేయటానికి ఎవరూ సాహసించటం లేదు. దాంతో ఆయన ఎవరో ఒకరు అన్నట్లు రాజావారి చేపల చెరువులో గైనా అనే అమ్మాయిని పరిచయం చేసారు. కానీ ఇప్పుడు ఆయన ఆర్తి సెకెండ్ ఇన్నింగ్స్ కి రెడీ అవటంతో ఆమెను వెంటనే తన చిత్రం లోకి తీసుకున్నారు. ఇక భర్త పర్మిషన్ తో సినిమాలు ట్ర్రై చేస్తున్నానంటున్న ఆర్తి తన పరిచయ దర్శక, నిర్మాతలనందరినీ కలుస్తోంది.

అయితే ఎవరూ పెద్దగా ఎంకరేజ్ చేయలేదు. దాంతో ఖాళీగా ఉండటం కన్నా చిన్న చిత్రాలయినా ఫరవాలేదని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం ఆమె చుట్టూ తిరిగే కథతో పోసాని తీస్తున్నారని తెలిస్తోంది. ఎప్పటిలాగే పోసాని దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తారు. ఈ చిత్రాన్ని వీరభద్ర ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లం పద్మజ నిర్మిస్తారు. కథా చర్చలు పూర్తయ్యాయి. ఈ చిత్రంలో ఓ యువ జంటకీ స్థానం ఉంది. ఆ పాత్రల్లో నటించే నాయకానాయికల వివరాల్ని త్వరలో ప్రకటిస్తారు. వచ్చే నెల నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. నల్లం శ్రీనివాస్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తారు.ఇక మొదట పోసాని ప్రక్కన నటించటానికి ఆర్తి ఆసక్తి చూపకపోయినా బయిట వేషాలు రావటం లేదు..ఏదో విధంగా లైమ్ లైట్ లో ఉండటం మేలని డిసైడ్ అయ్యే ఈ నిర్ణయానికి వచ్చిందంటున్నారు. అదీ సంగతి.

మీ వ్యాఖ్య రాయండి

Please read our comments policy before posting

Click here to type in Telugu
Subscribe Newsletter
Coupons
My Place My Voice