చిన్న వయసులోనే ఎవరూ ఊహించని స్థానానికి ఎగబ్రాకిన యువ హీరో ఎవరైనా ఉంటే అది యంగ్‌టైగర్ యన్.టి.ఆర్ అని చెప్పవచ్చు. 'నిన్ను చూడాలని' చిత్రం ద్వారా పరిచయమైన ఎన్టీఆర్ కు 'స్టూడెంట్ నం.1' చిత్రంతో తొలి విజయం లభించింది. ఆ తర్వాత వచ్చిన "ఆది", "సింహాద్రి" సినిమాలు అతని ఇమేజ్‍ని ఆకాశంలోకి తీసుకెళ్ళి పెట్టాయి. "సింహాద్రి" తర్వాత "యమదొంగ" వరకూ అతనికి సరైన హిట్ లేదు. ఎందుకంటే సింహాద్రి లో అతని పాత్ర అంత శక్తివంతమైనది. అది సృష్టించిన ఇమేజ్ గిరిలోంచి బయటపడటానికి జూనియర్ యన్.టి.ఆర్.కి చాలా సమయం పట్టింది.
అదే విధంగా రామ్ చరణ్ నటించిన రెండో చిత్రమే('మగధీర') భయంకరమైన హిట్టయితే, ఆ సినిమా ప్రభావం నుంచి బయటకు రావటం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే. ఎందుకంటే తర్వాత సినిమాని దానికంటే ఎక్కువ రేంజ్‍లో ఉండాలని ప్రేక్షకులు అంచనా వేస్తారు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గినా బాక్సులు ఇంటికి తిరికొచ్చేస్తాయి. సింహాద్రి చిత్రం తర్వాత జూనియర్ యన్.టి.ఆర్. పరిస్థితి రామ్ చరణ్‍కి ఎదురవకూడదని ఆశిద్దాం.