రామ్ చరణ్ తో ‘యమహానగరి కలకత్తాపురి’

బుదవారం, ఆగస్ట్ 26, 2009, 11:47 [IST]
Ram Charan
ఇటీవల విడుదలైన 'మగధీర" లో రెండు రకాల పాత్రలు చేసి రామ్ చరణ్ తేజ అందరిని ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమాలో చరణ్ ని ప్లేబాయ్ గా చూపించాలని భాస్కర్ అనుకుంటున్నాడని సమాచారమ్. చరణ్ సరసన కథానయికగా జెనీలియా నటించనుంది. రామ్ చరణ్ ప్లేబాయ్ కాబట్టి తన సరసన ఇంకా ముగ్గరు, నలుగురు కథానాయికలు ఉంటే భాగుంటుందని ఈ పాత్రల్లో కొత్తవారిని ఎంపిక చేయాలనుకుంటున్నారని సినిమా వర్గాలు తెలియజేశాయి.

ఇదిలా వుంటే ఈ చిత్రంలో ఓ రీమిక్స్ సాంగ్ పెట్టాలనుకుంటున్నారట. రామ్ చరణ్ ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన సమాచారం ప్రకారం ఆల్ టైమ్ ఫేవరేట్ సాంగ్ గా చిరంజీవి అంజలా జువేరి జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ 'చూడాలని వుంది" సినిమా లోని 'యమహానగరి కలకత్తాపురి" అనే పాటను ఈ చిత్రంలో చరణ్ కోరిక మేరకు రీమిక్స్ చేయాలనుకుంటున్నారని ఫిలింనగర్ సమాచారం.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST