twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్లి చేసుకోమని 30వేల ప్రపోజల్స్‌ వచ్చాయి.. విడాకుల తర్వాత హృతిక్ హాట్ న్యూస్

    By Bhavani
    |

    2000 సంవత్సరంలో కహో న ప్యార్‌ హై సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు హృతిక్‌ రోషన్‌. ఆరడుగుల ఎత్తు.. గ్రీకు శిల్పం లాంటి ఆకృతి.. నీలి కళ్ళు తొలి సినిమాతోనే అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టాడు హృతిక్‌. అప్పటివరకు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌ను అభిమానించిన యువత కూడా హృతిక్‌కు ఫ్యాన్స్‌ అయిపోయారు. ఇంకా అమ్మాయిల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. తాజా సినిమా వార్ ప్రమోషన్ సందర్భంగా కపిల్ శర్మ షోలో వెల్లడించారు.

    హృతిక్‌ను కలల రాకుమారుడిగా

    హృతిక్‌ను కలల రాకుమారుడిగా

    కహోనా ప్యార్ హై సినిమా తర్వాత బాలీవుడ్ యువ హీరో హృతిక్‌ను తమ కలల రాకుమారుడిగా హృదయాల్లో పెట్టుకొని ఆరాధించారు అప్పటి అమ్మాయిలు. అయితే, అదే సంవత్సరం డిసెంబర్‌లో తన చిన్నానాటి స్నేహితురాలు, గర్ల్‌ఫ్రెండ్‌ సుసానె ఖాన్‌ను హృతిక్‌ పెళ్లాడారు. దీంతో లక్షలాది హృతిక్‌ లేడీ ఫ్యాన్స్‌ హార్ట్స్‌ బ్రేక్‌ అయ్యాయి.

    కపిల్ కామెడీ షోలో

    కపిల్ కామెడీ షోలో

    కపిల్ కామెడీ షోలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించిన హృతిక్‌.. తన తొలి సినిమా విడుదలైన తర్వాత తనకు మ్యారేజ్‌ప్రపోజల్స్‌ వెల్లువెత్తాయని తెలిపాడు. పెళ్లి చేసుకోమంటూ తనకు దాదాపు 30వేలకుపైగా మ్యారేజ్‌ ప్రపోజల్స్‌ వచ్చాయని హృతిక్‌ తెలిపాడు.

     19 ఏళ్ల తర్వాత

    19 ఏళ్ల తర్వాత

    కహో నా ప్యార్‌ హై సినిమా వచ్చి 19 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ అభిమానుల హృదయాల్లో హృతిక్‌కు చెక్కుచెదరని స్థానముంది. ఇటీవల ఓ అమెరికా ఏజెన్సీ ప్రకటించిన `మోస్ట్‌ హ్యాండ్‌సమ్‌ మ్యాన్‌ ఇన్‌ ద వరల్డ్‌` ఘనతను క్రిస్‌ ఎవాన్స్‌, డేవిడ్‌ బేక్‌హామ్‌ లాంటి స్టార్లను ఢీకొట్టి హృతిక్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై హృతిక్‌ స్పందిస్తూ అందం, ఆహార్యం అన్నవి అంతముఖ్యం కాదని, క్యారెక్టరే అన్నింటికంటే ముఖ్యమైనదని, మంచి క్యారెక్టర్‌ను అలవర్చుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని, క్యారెక్టర్‌ అత్యంత ఆకర్షణీయమైనదని హృతిక్‌ పేర్కొన్నాడు.

    టైగర్ ష్రాఫ్‌తో హృతిక్ వార్

    టైగర్ ష్రాఫ్‌తో హృతిక్ వార్

    ప్రస్తుతం హృతిక్‌ సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన వార్‌ సినిమాలో నటించారు. తొలిసారి హృతిక్‌, టైగర్‌ ష్రాఫ్‌ కలిసి నటించిన ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదల కానుంది. ఈ ఏడాది వస్తున్న అతిపెద్ద యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా పేర్కొంటున్న వార్‌ సినిమా ప్రమోషన్స్‌లో ప్రస్తుతం హృతిక్‌ బిజీగా ఉన్నాడు. అతడు అంతకుముందు చేసిన సూపర్‌ 30 సినిమా సూపర్‌ సక్సెస్‌ అయిన సంగతి తెలిసిందే.

    English summary
    Bollywood hero Hrithik Roshan said I got over 30,000 marriage proposals after the release of My debut film after Kaho Naa Pyaar Hai. While Promoting His Latest Movie, He shared on The Kapil Sharma Show.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X