
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా చేస్తున్న చిత్రానికి సమంతా అనే అమ్మాయిని హీరోయిన్ తీసుకున్నట్లు సమాచారం. ఆమె తమిళ చిత్రం 'Moscovin Kaveri' ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం రిలీజ్ కాకముందే సమంతాకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇక ఈ చిత్రం తమిళంలో గౌతమ్ మీనన్ రూపొందిస్తున్న 'Vinnaithandi Varuvaaya' కి రీమేక్ అని అంతటా వినపడుతోంది. ఎ డిఫెరెంట్ లవ్ స్టోరీ అని ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రంలో శింబు, త్రిష జంటగా చేసారు. ఈ చిత్రం శింబు మాస్ ఇమేజ్ కి దూరంగా ఓ లవ్ స్టోరీలా రూపొందింది. ఇక నాగచైతన్య చిత్రం గురించి గౌతమ్ మాట్లాడుతూ ఇది ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ..నా గత చిత్రాల మాదిరిగానే ఉత్కంట రేపే సన్నివేశాలతో నిండి ఉండకపోయినా ఆసక్తిగానే కథనం నడుస్తోంది. అలాగే నా తరువాత చిత్రం మహేష్ బాబు హీరోగా అతని సోదరి మంజుల నిర్మించేది ఉంటుంది. మినిమం డైలాగులతో యాక్షన్ బేస్ గా ఆ చిత్రం నడుస్తుంది అంటూ గౌతమ్ చెప్పుకొచ్చారు. ఇక నాగచైతన్య మొదటి చిత్రం 'జోష్' ద్వారా రాధ కూతురు కార్తీక హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆమె కూడా తమిళంలో చిత్రాలు చేసిన తర్వాతే ఇక్కడ అడుగుపెట్టింది.












