twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Manu Charitra Review అర్జున్ రెడ్డి తరహాలో లవ్, యాక్షన్ డ్రామా.. శివ కందుకూరి ఎలా చేశాడంటే?

    |

    Rating:
    2.5/5
    Star Cast: Shiva Kanudukuri, Megha Akash, Priya Vadlamani
    Director: Bharath Peddagani

    నటీనటులు: శివ కందుకూరి, మేఘా ఆకాశ్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాస్తవ్, సుహాస్, ధనుంజయ్,
    శ్రీకాంత్ అయ్యంగార్, సుహాస్, రాజ్ తరుణ్, మధునందన్ తదితరులు
    దర్శకత్వం: భరత్ పెద్దగాని
    నిర్మాత: నరాల శ్రీనివాస్ రెడ్డి
    మ్యూజిక్ డైరెక్టర్: గోపి సుందర్
    సినిమాటోగ్రఫి: రాహుల్ శ్రీవాస్తవ
    ఎడిటర్: ప్రవీణ్‌పూడి
    రిలీజ్ డేట్: 2023-06-23

    మను (శివ కందుకూరి) చదువుల్లో ఫస్ట్ ర్యాంక్ సత్తా ఉన్న విద్యార్థి. శ్రావ్య (ప్రియ వడ్లమాని), ప్రియ, ఇంకా చాలా మంది అమ్మాయిలను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతాడు. వాళ్లు మను లవ్ ప్రపోజల్ అంగీకరించిన తర్వాత వారికి బ్రేకప్ చెబుతుంటాడు. జెన్నీఫర్ (మేఘా ఆకాష్( గురించి ఆలోచిస్తూ అనుక్షణం మద్యం మత్తులో తూలుతుంటాడు. ఇదిలా ఉండగా వరంగల్‌లో ఊహించిన విధంగా హత్యలు జరుగుతుంటాయి.

    స్టడీస్‌లో టాప్ ర్యాంకర్ అయిన మను ఎందుకు? ఎలా దారి తప్పాడు? కాలికట్ ఐఐటీలో సీటు వచ్చినా ఎందుకు వదులుకొన్నాడు? మను జీవితాన్ని జెన్నిఫర్ ఎలా మలుపుతిప్పింది. జెన్నిఫర్‌కు మను ఎందుకు దూరమయ్యాడు? తన జీవితంలోకి వచ్చిన స్కూల్ టీజర్ జాను (ప్రగతి శ్రీవాత్సవ్)కు మను ఎలాంటి ప్రేమను పంచాడు? జాను లవ్ ప్రపోజల్‌ను మను అంగీకరించాడా? వరంగల్‌ మేయర్, ఇతర వ్యక్తుల హత్యల వెనుక కారణం ఏమిటి? రౌడీ రుద్ర (ధనుంజయ్) పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే మను చరిత్ర సినిమా కథ.

    Manu Charitra Review and Rating: Shiva Kandukuris love and action drama

    అర్జున్ రెడ్డి తరహాలో సాగే లవ్ అండ్ యాక్షన్ చిత్రంగా మను చరిత్రను దర్శకుడు భరత్ పెదగాని తెరకెక్కించారు. హీరో క్యారెక్టరైజేషన్, ఆ పాత్ర చుట్టూ ఉండే పాత్రలను చక్కగా రాసుకొన్నాడు. అయితే కథను బలంగా నడిపించే సన్నివేశాలను రాసుకోవడంలో తడబాటు కనిపిస్తుంది. హీరో చుట్టూ తిరిగే పాత్రలు కొంత వీక్‌గా కనిపిస్తాయి. కొత్త దర్శకుడైనప్పటికీ.. కొన్ని సన్నివేశాలను అనుభవం ఉన్న దర్శకుడిగా బాగా చిత్రీకరించాడనే అభిప్రాయం కలుగుతుంది.

    మను పాత్రలో శివ కందుకూరి చాలా వేరియేషన్స్ చూపించాడు. మను పాత్ర తగినట్టుగా బాడీ లాంగ్వేజ్‌ను మేనరిజమ్స్‌ను, హావభావాలను చక్కగా చూపించాడు. మంచి కథ, పాత్ర పడితే తాను ఏ మాత్రం తగ్గే ప్రసక్తి లేదని ఈ సినిమాతో చెప్పకనే చెప్పాడు. రకరకాల గెటప్స్‌తో మంచి స్క్రీన్ ప్రజెన్స్ చూపించే ప్రయత్నం చేశాడు. కొన్ని సీన్లలో హ్యాండ్సమ్‌గా కనిపించాడు. నటనపరంగా ఇంకా బెటర్‌గా అనిపించుకోవడానికి కష్టపడాల్సిన అవసరం ఉంది.

    Manu Charitra Review and Rating: Shiva Kandukuris love and action drama

    జెన్నిఫర్‌గా మేఘా ఆకాష్, శ్రావ్యగా ప్రియా వడ్లమాని, జానుగా ప్రగతి శ్రీవాస్తవ్ తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు. అయితే కథలో ఎలివేట్ అయ్యేలా వారి పాత్రలు లేకపోకపోవడం వల్ల వారు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇక శ్రీకాంత్ అయ్యంగార్, ధనుంజయ్ ఒకే అనిపించారు. హీరో శివ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో సుహాస్ ఆకట్టుకొన్నారు. రాజ్ తరుణ్ ఓ స్పెషల్ అప్పీయరెన్స్‌తో సర్‌ప్రైజ్ చేస్తాడు.

    సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. సినిమాటోగ్రాఫర్ రాహుల్ శ్రీవాస్తవ వర్క్ సినిమాను రిచ్‌గా మార్చింది. ప్రతీ ఫ్రేమ్‌ను అందంగా ఉండేలా చేశారు. వరంగల్ సిటీని ఎవరూ చూపించిన విధంగా ఎన్ని ప్రాంతాలను ప్రేక్షకులకు పరిచయం చేయడంలో రాహుల్ సక్సెస్ అయ్యారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే.. గోపి సుందర్ మరోసారి ఆకట్టుకొన్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశాయి. డైలాగ్స్ కొన్ని చోట్ల బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే అనిపించింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

    Manu Charitra Review and Rating: Shiva Kandukuris love and action drama

    మను చరిత్ర డిఫరెంట్ థీమ్‌తో సాగే లవ్, రొమాంటిక్, యాక్షన్ డ్రామా. కొత్త హీరో ఫెర్ఫార్మెన్స్, కొత్త దర్శకుడి టేకింగ్, సాంకేతిక అంశాలు సినిమాకు బలంగా మారాయి. అయితే కథను నడిపించే ఎమోషన్స్ పూర్తిగా పండకపోవడంతో సినిమా అలా సాగిపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. కథ, కథనాలపై ఇంకాస్త దృష్టిపెట్టి ఉంటే అర్జున్ రెడ్డి, RX 100 తరహాలో యూత్‌కు జోష్ పుట్టించేదనిపిస్తుంది. లవ్, యాక్షన్ సినిమాలను చూసే వారికి, యూత్‌కు నచ్చే అంశాలు ఉన్నాయి. కాబట్టి ఓసారి ఈ సినిమాపై లుక్కేసుకోండి.

    English summary
    Young Hero Shiva Kandukuri's latest movie is Manu Charitra. This movie released on June 23rd. Here is the Telugu filmibeat review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X