ఏక్ నిరంజన్ చిత్రంలో ప్రభాస్ పాత్ర గురించి పూరీ జగన్నాధ్ వివరిస్తూ...అనాథ అయినవాడి బాధ ఎలా ఉంటుందో ప్రభాస్ పాత్రలో కనిపిస్తుంది. ఇందులో అతను పోలీసుల కోసం పనిచేస్తుంటాడు. అంటే 'బౌంటీ హంటర్' అన్నమాట. క్రిమినల్స్‌ని పట్టుకొచ్చి పోలీసులకు అప్పచెబుతుంటాడు అన్నారు. అలాగే ఈ ఏక్ నిరంజన్ కథకు ఏదైనా ప్రేరణ ఉందా అంటే పాత్ర కానీ, సినిమా కానీ దేనికీ కాపీ కాదు. ఏ పాత్ర ప్రేరణా దీనిమీద లేదు. నాకొచ్చిన ఒక ఆలోచనతో ఈ సబ్జెక్టు తయారుచేశా. రెండోసారి కూడా చూడాలనిపించే అంశాలు ఇందులో ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. అలాగే టైటిల్ సాంగ్‌లో హీరో పాత్ర ఎలా ఉంటుందన్నది తెలుస్తుంది.ఇక హీరోయిన్ గా చేసిన కంగనా గురించి మాట్లాడుతూ.. ఇప్పటిదాకా రియలిస్టిక్ సినిమాలే చేసిన ఆమెకు ఇదే తొలి పక్కా కమర్షియల్ సినిమా. ఇందులో ఆమె గిటార్ టీచర్‌గా నటించింది అన్నారు.






















