నా వయస్సు ఎంతటే..తమన్నా

శుక్రవారం, అక్టోబర్ 30, 2009, 12:37 [IST]
హ్యాపీ గర్ల్ తమన్నా తన వయస్సు గురించి అడగకుండానే చెప్తూ మిగతా హీరోయిన్స్ కూడా తన లాగే వయస్సుని దాచుకోకూడదని క్లాస్ పీకుతోంది. ఆ విషయమై మాట్లాడుతూ.."నా వయసు 19 అండి'...అయినా వయసు ఎంతో చెబితే తప్పేంటండి. వాస్తవానికి హీరోయిన్లందరూ మొహమాటపడకుండా తమ వయసు చెప్పుకోవాలన్నది నా అభిప్రాయం. ఎందుకంటే అభిమానులు మా వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తారు కదా? అలాంటప్పుడు తప్పుడు సమాచారం ఇస్తే ఏం బాగుంటుంది?' అంటున్నారామె.

ఇక తను నటించిన ప్రతి సినిమాలను చూసే విధానం గురించి తమన్నా చెబుతూ..నేను నటించే ప్రతి సినిమాని ఓ విశ్లేషకురాలిలాగా చూస్తాను అంటోంది. అలాగే చిత్రంలో పాజిటివ్‌ పాయింట్స్‌ని వదిలేసి మైనస్‌లను వెతికి పట్టుకునే పని మీద ఉంటాను. ముఖ్యంగా నా పాత్ర ఎలా ఉంది? బాగా చేశానా? లేదా? అని తప్పులు వెతుకుతాను. నిజంగా లోపాలేమీ లేకపోయినా లోపం ఉన్నట్లుగానే నాకనిపిస్తుంది. ఈ సినిమాలో బాగా చేయలేదు, తదుపరి సినిమాలో ఇంకా బాగా చేయాలి అనుకుంటాను' అన్నారామె.

అలాగే తమన్నాకి జాతీయ అవార్డు సాధించాలనే లక్ష్యం ఉందట. దాని గురించి చెబుతూ - "నాకు చిన్న అవార్డు వచ్చినా ఎంతో గొప్పగా భావిస్తాను. అవార్డులు పొందినప్పుడు నటిగా మనకి లభించిన గుర్తింపు ఇది అని భావిస్తాను. మంచి నటిగా, గ్లామరస్‌ ఆర్టిస్ట్‌గా...ఇలా ఏ కేటగిరీలో అయినా అవార్డు పొందాలని ఉంది. ముఖ్యంగా జాతీయ అవార్డు సాధించాలనుకుంటున్నాను' అని చెప్పారు తమన్నా. అంతేకాకుండా ఆ అవార్డు సాధించడానికి వీలుగా ఉన్న పాత్ర లభిస్తే పారితోషికం సైతం తగ్గించుకోవడానికి తమన్నా సిద్ధంగా ఉన్నానని శెలవిస్తోంది. బెస్ట్ ఆఫ్ తమన్నా..త్వరగా అవార్డు సాదించాలని కోరుకుంటున్నాం.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST