Englishবাংলাગુજરાતીहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்
 
Share This Story

లుక్స్ ‘వేదిక’ చిందులు!

Posted by:
Published: Tuesday, October 13, 2009, 9:28 [IST]

లుక్స్ ‘వేదిక’ చిందులు!
 

బాణం సినిమాలో నా కళ్ళను మరింత అందంగా చూపించే అవకాశం దక్కింది. ఈ సినిమాలో వేదిక పోషించింది చిన్న రోలే అయినా చాలెంజింగ్‌గా తీసుకొని అందులో నటించానని చెబుతోంది. దాదాపు ఏడాదిన్నర తరువాత మళ్ళీ తెలుగు తెరపై తళుక్కుమంది వేదిక. రాఘవ లారెన్స్‌ హీరోగా వచ్చిన 'ముని" సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ కన్నడ ముద్దుగుమ్మ, కళ్యాణ్‌రామ్‌తో కలిసి 'విజయదశిమి" సినిమాలో నటించింది. ఆ తరు వాత తమిళ, కన్నడ చిత్రాలతో బిజీగా మారింది. మళ్ళీ నారా రోహిత్‌తో జంటగా 'బాణం" చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడా చిత్రం మంచి విజయం సాదించడంతో తెగ చిందులేస్తోంది.

కన్నడ కుటుంబంలో పుట్టినా, వేదిక పుట్టిపెరి గింది అంతా ముంబాయిలోనే. మాధురీ దీక్షిత్‌, శ్రీదేవిల నటనను అనుసరిస్తూ బాలనటిగా ఎన్నో స్టేజిషోలలో ప్రదర్శనలిచ్చింది. చిన్నప్పటినుండే సినీయాక్టర్ కావాలని చాలా గట్టి కోరికే వుండేదట వేదికకి. చిన్నప్పుడు ఇదే విషయాన్ని తన స్నేహితుల దగ్గర ప్రస్తావిస్తే వారు దాన్ని తేలికగా తీసుకునేవారట. సినిమాల్లోకి రాకముందు ఐదు సంవత్సరాలపాటు యూకేలో చదివిన వేదిక, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పూర్తి చేసుకుంది. అక్కడే మార్కెటింగ్‌లో మాస్టర్‌ డిగ్రీని కూడా పూర్తి చేసింది. 'చదువు పూర్తి చేసి ప్రాపంచిక విషయాలపై కొంత అవగాహన పెంచుకున్న తరువాత దక్షిణాది చిత్ర పరిశ్రమ నా సినీరంగ ప్రవేశానికి సరైన వేదికగా భావించి ఇండస్ట్రీలో కాలుమోపాను" అని తన చిత్ర రంగ అరంగేట్రం గురించి తెలియజేసింది వేదిక.

అందమైన కళ్ళు తనకు అస్సెట్‌ అని చెబుతున్న వేదిక 'బాణం" చిత్రం విజయం వైపు దూసుకెళ్తుండడంతో తెగ సంతోషపడిపోతోంది. 'బాణం" సినిమాలో నా కళ్ళను మరిం త అందంగా చూపించే అవకాశం దక్కింది. ఈ సినిమాలో వేదిక పోషించింది చిన్న రోలే అయినా చాలెంజింగ్‌గా తీసుకొని అందులో నటించానని చెబుతోంది. 'ఈ సినిమాలో నా పాత్ర హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ రోల్‌ కాకపోయినా, నేను నటించిన ప్రతి చిత్రంలోనూ చాలెంజ్‌గా తీసు కొని నటించాను. ఇందులో కుంటుంబాన్ని కోల్పోయిన ఒక బిడియస్తురాలి పాత్రలో నటించాను." అని చెబుతోంది. ప్రేక్షకుల మధ్యలో కూర్చొని 'బాణం" సినిమా చూడటం ఎంతో ఆనందాన్నిచ్చింది అంటోంది. 'సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు చప్ప ట్లు, ఈలలతో హంగామా చేయడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది." అని ఆనందాన్ని వ్యక్తపరిచింది వేదిక.

నాణ్యమైన వార్తలను అందిస్తున్న వన్ఇండియా... ఇప్పుడు మీకోసం ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ల ద్వారా మరిన్ని అప్‌డేట్స్
Topics: kalyan ram, కళ్యాణ్ రామ్, nara rohit, నారా రోహిత్, muni, ముని, బాణం, vedika, వేదిక, baanam, రాఘవ లారెన్స్, విజయదశమి, raghava larence, vijaya dashami
మీ వ్యాఖ్య రాయండి

Please read our comments policy before posting

Click here to type in Telugu
Subscribe Newsletter
Coupons
My Place My Voice