twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Andhra Pradesh థియేటర్స్ రీ ఓపెన్ కు గ్రీన్ సిగ్నల్.. కానీ 100% కాదు!

    |

    కరోనా ఎఫెక్ట్ తో సినిమా పరిశ్రమలకు దాదాపు ఏడాదిన్నర కాలం వృధా అయ్యింది. మధ్యలో కాస్త సెట్టయ్యిందని అనుకునే లోపే కరోనా సెకండ్ వేవ్ మరోసారి దెబ్బకొట్టింది. అప్పులు చేసి సినిమాలను నిర్మించిన నిర్మాతలు కొందరు కంగారు పడ్డారు. కొందరైతే వడ్డీ ఎఫెక్ట్ ను తట్టుకోలేక ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక ఫైనల్ లాక్ డౌన్ ఎత్తివేయడంతో మెల్లగా థియేటర్స్ ని ఓపెన్ చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే గత నెలలోనే 100% ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చని ఒక క్లారిటీ ఇచ్చేసింది. కానీ ఇంకా సినిమా రిలీజ్ డేట్స్ ఏవి కూడా ఎనౌన్స్ చేయకపోవడంతో థియేటర్స్ ఓనర్స్ కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా పర్మిషన్ వస్తే సినిమాలను విడుదల చేయాలని అనుకున్నారు. ఇక ఫైనల్ గా ఏపీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది.

     Theaters in AP will be reopening from 8th July

    అయితే ప్రస్తుతం రిస్క్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం లేనట్లు తెలుస్తోంది. పాత పద్దతిలోనే 50% ఆక్యుపెన్సీకి అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. జూలై 8 నుంచి థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చట. దీంతో ఇప్పుడు సినిమా పరిశ్రమలో మళ్ళీ చర్చలు మొదలయ్యాయి. 100% ఆక్యుపెన్సీ ఉంటేనే ప్రస్తుత పరిస్థితుల్లో ఓపెనింగ్స్ గతంలో మాదిరిగా అయితే ఉండవు. ఇక 50% అంటే అన్ని సినిమాలకు అదృష్టం కలిసి రాదు. ఇక ఈ విషయంలో సినీ పెద్దలు ఆంధ్ర ప్రదేశ్ సీఎంను కలిసి చర్చించేందుకు సిద్ధమవుతున్నారు. మరి చర్చల అనంతరం ఏదైనా మార్పులు చేస్తారేమో చూడాలి.

    English summary
    Theaters in AP will be reopening from 8th July. With 50% Occupancy. TG - 100% Occupancy allowed. New movies release dates Soon..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X