Englishবাংলাગુજરાતીहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்
 
Share This Story

నన్ను ఫూల్ అని అనుకోవచ్చు: మంచు విష్ణు

Posted by:
Published: Monday, December 26, 2011, 8:48 [IST]

నన్ను ఫూల్ అని అనుకోవచ్చు: మంచు విష్ణు
 

"ఒక మంచి అవకాశాన్ని వదులుకున్నందుకు నన్ను ఫూల్ అని చాలామంది అనుకోవచ్చు. కానీ ఓ తండ్రిగా బిడ్డలను దగ్గరుండి చూసుకోవడం ఓ రివార్డ్‌లాంటిది. ఆ ఆనందాన్ని మిస్ కాదల్చుకోలేదు" అంటున్నారు మంచు విష్ణు. ఈ నెల 2న విష్ణు భార్య విరానికా కవలపిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తన పాపాయిలకు పేర్లు పెట్టిన విషయం విష్ణు ప్రకటనలో తెలియచేస్తూ ఇలా స్పందించారు. అలాగే... "నేను... ఓ పెద్ద దర్శకుడి సినిమా నేను వదులుకోవలసి వచ్చింది. విరానికా డెలివరీ సమయంలో కేవలం మూడే రోజులు నాకు షూటింగ్‌కి బ్రేక్ ఇస్తానన్నారు. అమెరికాలో ఉండటం, వినీని, నా బిడ్డలను దగ్గరుండి చూసుకోవాలకున్న కారణంగా ఆ సినిమా చేయలేకపోయాను" అన్నారు.

"ఇక నేను సినిమాల్లో యాక్ట్ చేయడానికే పుట్టాను. నా వయసు చాలా చిన్నది కాబట్టి ఆ దర్శకుడితో భవిష్యత్తులో సినిమా చేస్తాను. ప్రస్తుతానికి ఈ ఆఫర్‌ని ఎందుకు వదులుకున్నాననే విషయాన్ని ఆయన అర్థం చేసుకుని ఉంటారని భావిస్తున్నాను" అని అన్నారు. అయితే ఆ దర్శకుడి పేరు మాత్రం ఆయన చెప్పలేదు. ప్రస్తుతం విష్ణు...నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. కోన వెంకట్ రచన చేస్తున్న ఈ చిత్రం పక్కా కామిడీతో నడిచే మాస్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. ఆయన పాపలిద్దరి పేర్లు - ‘అరియానా’, ‘వివియానా’.

నాణ్యమైన వార్తలను అందిస్తున్న వన్ఇండియా... ఇప్పుడు మీకోసం ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ల ద్వారా మరిన్ని అప్‌డేట్స్
Topics: vishnuvardhan babu, dhee, srinu vytla, విష్ణువర్ధన్, ఢీ, శ్రీను వైట్ల
English summary
"With the blessings of our parents, Vini and I have decided on the names of our Twins. Ariaana Manchu and Viviana Manchu" said Manchu Vishnu.
మీ వ్యాఖ్య రాయండి

Please read our comments policy before posting

Click here to type in Telugu
Subscribe Newsletter
Coupons
My Place My Voice