బాలయ్య ‘అధినాయకుడు’పై అనుమానాలు!

సోమవారం, జనవరి  30, 2012, 16:43 [IST]
నందమూరి బాలకృష్ణ త్వరలో ‘అధినాయకుడు’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్లోనే తొలి సారిగా మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. సలోని, లక్ష్మి రాయ్ బాలయ్యతో రొమాన్స్ చేయనున్నారు. పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎంఎల్ కుమార్ చౌదరి కీర్తి కంబైన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కళ్యాణి మాణిక్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

అయితే ఈ సినిమాపై ఇటు బాలయ్య అభిమానుల్లోనూ, అటు ట్రేడ్ వర్గాల్లోనూ అనేక అనుమానాలు నెలకొన్నాయి. మరికొన్ని రోజుల్లో శివరాత్రి సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నప్పటికీ....అసలు సినిమాపై ఎలాంటి హైప్ ఇప్పటి వరకు పెరగక పోవడమే ఇందుకు కారణం. దర్శక నిర్మాతలు సినిమాను పబ్లిసిటీ చేయడంలో విఫలం అవుతున్నారా? లేక జనాలు ఈ సినిమా గురించి పట్టించుకోవడం లేదా? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

వాస్తవానికి ‘అధినాయకుడు’ సినిమా చాలా నెలల క్రితమే ప్రారంభం అయింది. ప్రొడక్షన్ విషయంలో లేట్ కావడంతో బాలయ్య అప్పట్లో ఈ సినిమాను పక్కన పెట్టి ’శ్రీరామ రాజ్యం’ సినిమాను మొదలు పెట్టి పూర్తి చేశారు. శ్రీరామ రాజ్యం సినిమా హిట్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ....నిర్మాత నష్ట పోయాడని, యువతలో ఈ సినిమాపై ఆసక్తి లేదనే వార్తలు వినిపించాయి. ఈ పరిణామాలన్నీ వెరసి ‘అధినాయకుడు’ సినిమాపై ఆసక్తిని తగ్గించాయేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దర్శక నిర్మాతలు ఏదో ఒకటి చేసి సినిమాపై అంచనాలు పెంచాలని, లేక పోతే ఈ తరం యువ హీరోలతో బాలయ్య సినిమా పోటీ పడటం కష్టం అవుతుందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
English summary
Balakrishna's Adhinayakudu movie was launched long back. It ran into trouble during the production stage and Balakrishna moved on to do Sri Rama Rajyam movie. By then this film's shoot was almost complete. Sadly, Sri Rama Rajyam didn't fare well at the box office and therefore there are no takers for Adhinayakudu.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST