కలెక్షన్స్, రికార్డుల గురించి మహేష్ బాబు

సోమవారం, జనవరి  30, 2012, 10:34 [IST]
ఈ మధ్యకాలంలో ఎక్కువ రికార్డుల వివాదం జరిగింది 'దూకుడు'చిత్రానికే. ఈ చిత్రం రామ్ చరణ్ చిత్రం మగధీరను అధిగమించిందని కొందరు,కాదని మరికొందరు హోరాహోరీగా పోరాటాలు చేసారు. కొద్ది రోజులు పాటు మీడియాలో కేవలం ఈ రికార్డుల గొడవే వినిపించింది. అది గమనించో ఏమో కానీ 'బిజినెస్‌మేన్‌'కలెక్షన్స్,రికార్డులను పెద్దగా పబ్లిసిటీ చేయటం లేదు. ఈ నేపధ్యంలో రికార్డులు ఎంత వరకూ అవసరమో అని మహేష్ ని మీడియా వారు అడిగితే ...''రికార్డుల గురించి మాట్లాడుకోవడం తప్పు కాదు. 'దూకుడు' సినిమా గత రికార్డులను అధిగమించినా.. ఇప్పుడు 'బిజినెస్‌మేన్‌' వాటిని దాటేసినా.. ఇవన్నీ పరిశ్రమకు మంచిదే. ఈ విజయాలు మిగతా సినిమాలకు స్ఫూర్తి కావాలి. కేవలం ఈ అంకెల్ని చూసి 'నేను నంబర్‌ వన్‌' అనుకోవడం తప్పు. నా తదుపరి సినిమాకీ ఈ విజయాన్ని కొనసాగించడంపైనే దృష్టి పెడుతున్నా అని స్పందించారు.

ఇక ప్రస్తుతం మహేష్ తన తాజా చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగ్ బిజీలో ఉన్నారు. ఈ చిత్రం అనంతంరం సుకుమార్ దర్శకత్వంలో రూపొందే చిత్రం అవుతుంది. వీటి తర్వాత బిజినెస్ మ్యాన్ 2 చేయాలని ఉత్సాహపడుతున్నారు. త్రివిక్రమ్‌, శ్రీనువైట్లతో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలని ఉందని ఆయన అన్నారు.
English summary
Mahesh Babu also intrests in records and collections.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST