ట్విట్టర్ విషయంలో మహేష్ బాబు తీరు సమర్థనీయమా?

సోమవారం, జనవరి  30, 2012, 12:24 [IST]
సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అభ్యంతరకర పోస్టులను సెన్సార్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో...ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సైట్లు కొత్త సెన్సార్ విధాలను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఎవరు ఎలాంటి పోస్టులు చేసినా...తొలుత సెన్సార్ చేసిన తర్వాతే పోస్టు చేయబడతాయి. ట్విట్టర్లో కొనసాగుతున్న హీరో మహేష్ బాబు సెన్సార్ విధానంపై స్పందిస్తూ...ట్విట్టర్ మంచి నిర్ణయం తీసుకుంది. అభ్యంతరకర పోస్టులు, వ్యక్తిగత అభ్రిపాయాలకు పబ్లిక్ ఫోరంలలో స్థానం లేకుండా చేయడం అభినందించదగ్గ విషయమే, కొందరి వాదనలు మరికొందరి మనసులను గాయపరచవచ్చు, ఫిల్టరింగ్ విధానం మంచిదే అని పేర్కొన్నారు.

అయితే ఈ సెన్సారింగ్ విదానాలను మరికొందరు తప్పు పడుతున్నారు. ఇలా చేయడం ప్రాథమిక హక్కలను కాలరాడయమే అని, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమే అని, ఇలా చేయడం నియంతృత్వ ధోరణి కిందకి వస్తుందని, కేంద్ర ప్రభుత్వ తీరుతో పాటు అందుకు అంగీకారం తెలిపిన ఆయా సైట్ల తీరు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ట్విట్టర్ సెన్సార్‌షిప్‌ను మహేష్ బాబు సమర్థించడంతో.......మహేష్ బాబు తీరు సమర్థనీయమా? అనే వాదన తెరపైకి వచ్చింది. ఆయన తీరు సబబే అని కొందరు అంటుంటే? స్టార్ హోదాలో ఉండి వ్యక్తి గత స్వేచ్ఛకు భంగం కలిగిచే నిర్ణయాలను సమర్థించడం ఏమిటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
English summary
"It's an excellent move if they implement this. In my opinion, Personal issues shouldn't be discussed on public forums. We come across offensive words and other abuses in the comments, so it will be good if they are filtered," opined Mahesh Babu.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST