బాలయ్య-పవన్ కళ్యాణ్... ఎవరి లుక్స్ పవర్‌ఫుల్?

సోమవారం, జనవరి  30, 2012, 17:15 [IST]
నందమూరి నట సింహం బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేర్వేరుగా నటిస్తున్న తాజా సినిమాలు ‘అధినాయకుడు’, ‘గబ్బర్ సింగ్’ త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. రెండు చిత్రాలకు సంబంధించిన స్టిల్స్ గత కొన్ని రోజుల క్రితమే విడుదలయ్యాయి. కాకతాళీయంగా ఈ రెండు సినిమాల్లోనూ ఈ ఇద్దరు హీరోలు భుజం పైన గన్స్ పెట్టుకుని ఫోటోలకు పోజు ఇచ్చారు.

ఈ ఇద్దరిలో ఎవరి లుక్స్ పవర్ ఫుల్‌గా ఉన్నాయనేదానిపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. షరా మామూలుగానే బాలయ్య అభిమానులు బాలయ్యకు మద్దతుగా, పవన్ కళ్యాణ్ అభిమానులు పవర్ స్టార్ కు మద్దతుగా......తమ హీరో లుక్స్ పర్ ఫుల్ గా ఉన్నాయంటే తమ హీరో లుక్స్ పర్ ఫుల్ గా ఉన్నాయని తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ‘అధినాయకుడు’ సినిమాను ఎంఎల్ కుమార్ చౌదరి కీర్తి కంబైన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. బాలయ్య సరసన సలోని, లక్ష్మి రాయ్ నటిస్తున్నారు. కళ్యాణి మాణిక్ ఈ సినిమాకు సంగీతం అందించారు. శివరాత్రికి ఈ సినిమా విడుదల చేయనున్నారు.

గబ్బర్ సింగ్ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. బండ్ల గణేష్ ఈ చిత్రానికి నిర్మాత. సంగీతం దేవి శ్రీ ప్రసాద్. ఏప్రిల్ లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.
English summary
Nandamuri Natasimha Balakrishna and power star Pawan Kalyan have their own ways of holding guns. These two star heroes have carved a niche for themselves in Tollywood for panache and grace. While Pawan Kalyan sets new trend in apparels or holding weapons, Balakrishna lends power and elegance to the persona. Balayya and Pawan are coming up with action entertainers in their upcoming movies – Adhinayakudu and Gabbar Singh.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST