గబ్బర్ సింగ్‌తో కలిసి నవ్వించేది అతడేనా?

గురువారం, ఫిబ్రవరి 2, 2012, 18:50 [IST]
pawan kalyan
పవన్ కళ్యాణ్ తర్వలో గబ్బర్ సింగ్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. హారిష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈచిత్రలో గబ్బర్ సింగ్ పక్కన కమెడీయన్ అలీ ‘సాంబ’పాత్రలో కనిపించనున్నాడని, ఫుల్ లెన్త్ రోల్‌లో ప్రేక్షకులను నవ్వించనున్నాడని సమాచారం.

ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వరి ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తయిది. మిగతా భాగాన్ని త్వరలోనే పూర్తి చేసి ఏప్రిల్ 27న సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొంద బోతున్న విషయం తెలిసిందే. మే నెల నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈచిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

అంతే కాకుండా....భద్ర, తులసి, సింహా లాంటి విజయవంతం అయిన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు బోయపాటి శ్రీను త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.
English summary
Is Ali the Samba of Pawan Kalyan? Yes, says the buzz. Comedian Ali is playing a full length hilarious role in Power Star Pawan Kalyan's forthcoming film Gabbar Singh. The name of his character is Samba.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST