బాలయ్య, సచిన్ టెండూల్కర్ టార్గెట్ ఒక్కటే...!

గురువారం, ఫిబ్రవరి 9, 2012, 15:49 [IST]
తెలుగు హీరో బాలకృష్ణ, టీమిండియా క్రికెటర్ సచిన్ టెండూల్కర్ టార్గెట్ ఒక్కటే అని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇద్దరి ప్రొఫెషన్స్ వేర్వేరు. అసలు ఒకరితో ఒకరికి సంబంధం గానీ, పోలిక గానీ అస్సలు లేదు. మరి ఏమిటీ ఈ టార్గెట్ అనుకుంటున్నారా?

అసలు వివరాల్లోకి వెళితే...
ఇప్పటికే 99 సెంచరీలు సాధించిన సంచిన్ టెండూల్కర్ 100వ సెంచరీ కోసం తాపత్రయ పడుతున్నాడు. అప్పట్లో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు సిరీస్ దగ్గరి నుంచి నిన్న శ్రీలంకతో జరిగి టెస్టు మ్యాచ్ వరకు ఆ ఒక్కటి పూర్తి చేద్దామని ఎంత ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. దీనిపై పట్టు వదలని విక్రమార్కుడిలా 100ను టార్గెట్గా చేసుకుని ప్రయత్నిస్తున్నాడు సచిన్.

బాలయ్య విషయానికొస్తే ఇప్పటి వరకు 94 సినిమాలుపూర్తి చేసుకున్న ఆయన 100కు చేరువయ్యారు. అయితే ఆ మిగిలిన సినిమాలు పూర్తి చేయడం అంత సులభం ఏమీ కాదు. ఆ సినిమాలు విజయవంతం అవ్వడం కూడా సవాల్ తో కూడుకున్నదే. ప్రస్తుతం రాజకీయాల వైపు చూస్తున్న బాలయ్య సెంచరీ పూర్తి చేస్తాడా? లేదా? అనే దానిపై అభిమానుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి.

English summary
Sachin and Balayya are facing same problem that is linked to 'a century' in their respective careers. Sachin has been trying hard to find his century of centuries for so long, but couldn't succeed yet. Balakrishna too is in a hurry to complete century of films and signing in everything that comes his way.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST