ఆ గ్యాంగ్ వస్తే ‘రచ్చ’ ఆడియో రచ్చరచ్చే!

మంగళవారం, ఫిబ్రవరి 21, 2012, 18:27 [IST]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ‘రచ్చ’ ఆడియో వేడుకను మార్చి 4న కర్నూలులో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకను వీక్షించే వారిని ఆశ్చర్యంలో ముంచెత్తేందుకు ఓ స్పెషల్ గ్యాంగ్‌ను రంగంలోకి దింపుతున్నారు నిర్వాహకులు. ఆ గ్రూఫ్ పేరు ‘బిర్ ఖాల్సా’. టీవీ రియాల్టీ షోలలో స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ పిచ్చెక్కించే డాన్స్ స్టెప్పులు, నమ్మలేని విధంగా యాక్షన్ స్టంట్స్ చేస్తూ అదరగొడుతున్న ఈ గ్రూపు ‘రచ్చ’ ఆడియో వేడుకలో లైవ్ పెర్ఫార్మెన్ ఇవ్వనుంది.

సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న రచ్చ సినిమాలో చెర్రీ సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందించారు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రచ్చ చిత్రాన్ని మార్చి చివరి వారంలో గాని ఏప్పిల్ నెలలోగానీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆరెంజ్ ప్లాప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈచిత్రాన్ని చేస్తున్నాడు.
English summary
The famous Bir Khalsa group, which gained fame for some stunning performances in the reality show ‘Adhurs’, has been roped in to perform on Rachcha Audio stage.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST