అభిమానులకు పిచ్చెక్కిస్తున్న సూపర్ స్టార్!

సోమవారం, ఫిబ్రవరి 13, 2012, 14:56 [IST]
సూపర్ స్టార్ రజనీకాంత్ తన తాజా సినిమా ‘కొచ్చాడయాన్’ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే, సినిమా విడుదలకు ముందే అభిమానులకు పిచ్చెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రజనీకాంత్ సిక్స్ ప్యాక్ బాడీతో ఉన్న ఫోటోను విడుదల అయింది. తాజాగా మరో మతి పోగొట్టే ఫోటోను విడుదల చేశారు. ఇది మార్ఫింగ్ మాయాజాలమే అయినా.....రజనీ అభిమానులకు మాత్రం సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఈ చిత్రంలో రజనీకాంత్..రణధీరన్‌ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్‌ మీనన్‌ కెమెరా వర్క్ అందించనున్నారు. ఫెర్ఫార్మెన్స్‌ క్యాప్చరింగ్‌ పరిజ్ఞానంతో ఈ సినిమాను త్రీడీలో చిత్రిస్తారు. 2012 ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాని 'అవతార్‌', 'ద అడ్వెంచర్‌ ఆఫ్‌ టిన్‌టిన్‌' తరహాలో తీర్చిదిద్దేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.

ఈచిత్రం ద్వారా రజనీ కూతురు సౌందర్య దర్శకురాలిగా పరిచయం అవుతోంది. ప్రముఖ దర్శకుడు, రచయిత కె.ఎస్. రవికుమార్ ఈ చిత్రానికి కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వంలో సౌందర్యకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

ఈ చిత్రం యొక్క డబ్బింగ్ రైట్స్‌ను ప్రముఖ తెలుగు సినీ నిర్మాణ సంస్థ ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉందని, తెలుగు ఈ చిత్రానికి ‘ఖడ్గ రుద్ర’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని, అందుకే ఈ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
English summary
Superstar Rajinikanth's new movie Kochadaiyaan new still is out. Rajini is looking powerful with a bow and arrow in this still and the intensity in his eyes is superb. The first look posters released couple of days ago received terrific response from audience as well as fans.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST